అమ్మాయి ప్రేమ పరిణయం 38
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 38 "హాస్పటల్ లో జాయిన్ చేసాం. డాక్టర్ చిన్న దెబ్బలే పర్వాలేదంటున్నాడు. కానీ నాకు, అమ్మకి కంగారుగా ఉంది అన్నయ్య. నువ్వు తొందరగా రావా" అని అడుగుతాడు
"సరే ఒకసారి డాక్టర్ కి ఇవ్వు నేను మాట్లాడతా" అన్నాడు
డాక్టర్ తో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అతను ఫోన్ పెట్టేయడం చూసి ముక్త అడుగుతుంది "ఏమయింది" అని
"నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందంట. ఇప్పుడే మంజరి ఫోన్ చేసింది. డాడీ ని హాస్పిటల్ కి తీసుకొని వచ్చారని."
"అయ్యో అవునా ఇప్పుడెలా ఉంది"
"డాక్టర్ తో మాట్లాడాను పర్వాలేదు అన్నారు. చిన్న దెబ్బలే తగ్గిపోతాయి అని చెప్పారు. స్పృహ లోకి రావడానికి ఇంకా గంట పడుతుందంట. మంజరి, అమ్మా ఇద్దరే ఉన్నరు గా బాగా కంగారు పడుతున్నారు" అని "ముక్తా నేను అర్జెంట్ గా హాస్పటల్ కి వెళ్ళాలి నువ్వేమనుకోకపోతే ఈ వర్క్ మొత్తం ఫినిష్ చేసేస్తావా" అని అడుగుతాడు
"ఆ నేను చేసేస్తాలే నువ్వెళ్ళు" అంటుంది ముక్త
అతను యశ్వంత్ క్యాబిన్ కి వెళ్తాడు అతనికి చెప్పి వెళ్దామని. అతను వెళ్లేటప్పటికి యశ్వంత్ లాప్టాప్ లో చాలా బిజీగా ఉంటాడు. డోర్ నాక్ చెయ్యగానే "కమిన్" అంటాడు
సంజయ్ లోపలికి వచ్చి యశ్వంత్ కి జరిగిందంతా క్లుప్తంగా చెప్తాడు.
"అవునా ఇప్పుడెలా ఉంది అంకుల్ కి"
"పర్వాలేదు బానే ఉంది...బట్ నేను హాస్పటల్ కి వెళ్ళాలి రా"
"నేను ఎలాగో ఇప్పుడు బయటకి వెళ్ళాలి నాకు ఒక క్లైంట్ తో ఇప్పుడు డిన్నర్ ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వు డ్రైవింగ్ చెయ్యడం ఎందుకు నేను నిన్ను దింపేస్తా లే. ఒకసారి అంకుల్ ని చూసి పలకరించినట్టు కూడా ఉంటుంది" అంటాడు
"థ్యాంక్స్ రా" అంటాడు సంజయ్
యశ్వంత్ నవ్వుతూ "టూ మచ్ చెయ్యకు" అని లాప్టాప్ ని క్లోజ్