శృంగార నగరం 16
"మరి స్టార్ట్ చేద్దామా?"
ఆ మాటకు ఠక్కున లేచాడు వాడు. శబ్దాలనుబట్టి వాడు లేవడాన్ని గుర్తించాను.
"లేవకు చెప్పానుగదా. నువ్వు లేచి అడుగులు వేస్తే గాజుముక్కలు శత్రువుల్లా నీ పాదాల్ని చీరేస్తాయని."
అతను అయిష్టంగానే తిరిగి కూర్చున్నాడు. నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నానన్న పజిల్ వాడి ముఖాన్ని వికారంగా ఉబ్బిస్తోందని నాకు తెలుసు.
"నువ్వక్కడే- నేను ఇక్కడే- నువ్వు నేను చెప్పింది వినాలి తప్ప మరేం చేయకూడదు. రామా ఈజ్ ఏ గుడ్ బోయ్ అన్నట్లు నువ్వు కూర్చోవాలి. మరి స్టార్టు చేయనా?"
అతను వూపిరి బిగపట్టాడు.
"ఇదంతా ఎందుకో నీకు అర్థం కావడంలేదు. పోగా పోగా అర్థమవుతోంది. ఒకరికి ఒకరు కనిపించని ఈ చీకట్లో ఇద్దరం చాలా దూరంలో వుండి జరిపే ఈ కొత్తరకం రొమాన్స్ ఎలా వుందో చివర్లో నువ్వే చెప్పాలి.
ఇందులో భాగంగా మొదట జుట్టుముడి విప్పుతున్నాను. ఇప్పుడు పైనున్న క్లిప్ తీశాను, నా జుట్టు బంధనాలన్నీ తెంచుకొని చల్లగాలికి కదిలిన మేఘంలా పరుచుకుంది. కానీ పాపం నీకేమీ కనిపించడంలేదు అవునా?"