శృంగార నగరం 2
"ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని."
" అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా" క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు.
"అలానే"
నరుడు ఖుషీ అయిపోయాడు.
"పట్టణాలు బోరు కొట్టాయి గురుడా..... ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను 'గురుడా' అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ. అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను."
"కానీ నాకు వ్యవసాయం లేదే."
"మరి నీ భుక్తి?"
"ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది."
"రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?"