శృంగార నగరం 4
అంతా విన్నాక అతను "నీ భర్తేకాదు- చాలామందికి పడకటింట్లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదు. భర్త భార్య జాకెట్ హుక్ లు తప్పిస్తూ ఉదయం బజార్లో తను ఎంత తెలివిగా కేజీమీద పావలా తగ్గిస్తూ వంకాయలు బేరమాడిందీ చెబుతాడు.
ఆమెకూడా అతనికంటే ఏమీ తీసిపోదు. అతని ఛాతీమీద వెంట్రుకలను స్పృశిస్తూ తను మధ్యాహ్నం చేసిన వేరుశనగపప్పుల పచ్చడిని అమ్మలక్కలు ఎంతగా మెచ్చుకున్నారో చెబుతుంది. ఇలా నడుస్తాయి మన బెడ్ రూమ్ ల సంభాషణలు. అందుకే భార్యాభర్తలకు తక్కువకాలంలో సెక్స్ రొటీన్ అయిపోతుంది. బెడ్ టైమ్ టాక్ అంటే మనసుని కదిలించేటట్లు, శరీరాన్ని రగిలించేటట్లు వుండాలి. రతికళలో బెడ్ టైమ్ టాక్ కూడా ఒక భాగం" అన్నాడు.
"చాలా ఇళ్ళల్లో బెడ్ రూమే వుండదు. ఇది బెడ్ టైమ్ టాక్ ఎక్కడిది? పల్లెటూళ్ళల్లో అయితే మరీ ఘోరం. ఒకే ఇంట్లో మొత్తం సంసారం అంతా వుంటుంది. అందరూ ఒకే దగ్గర పడుకుంటారు.
ఏ అపరాత్రో మూడ్ వచ్చినప్పుడు భర్త అందర్నీ తప్పించుకుని భార్య పక్కన చేరి, పిల్లిపాలు తాగినట్లు నిశ్శబ్దంగా తన ఆరాటాన్ని తీర్చుకుంటాడు. ఇక మాట్లాడటానికి వీలు ఎక్కడిది? మాటలు వినిపిస్తే ఎవరైనా లేస్తారేమోనన్న భయం. అందుకే ముందు నమస్కారాల బాణాలు లేకుండానే యుద్ధం మొదలవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్య మా ఇంట్లో జరిగిన ఓ సంఘటన చెబుతాను" అంటూ ప్రారంభించింది.