అందమైన మాయ 27
telugu stories kathalu novels అందమైన మాయ 27 పూజారి గారు పంచాంగం చూసి ‘ఇంకో పదహారు రోజుల్లో రథసప్తమి. లోటుపాట్లు లేకుండా ఊరేగింపు చేద్దాము. నాయనా, ఈసారి కూడా పుణ్యం కట్టుకో. వచ్చే సంవత్సరం వరకూ అందరూ కుదుటపడొచ్చు’ అని కిరీటిని ఒప్పించారు.
తరువాతి రోజుల్లో ఊరి జనాలు కాస్త సర్దుకున్నారు. కానీ జరిగిన దాని ప్రభావం వెంటనే సద్దుమణగలేదు. ఊళ్ళో కొత్త ముఖాలు కనిపిస్తే కాస్తంత అనుమానంగా చూస్తున్నారు. ప్రెసిడెంటు గారిల్లు కోటలా మారింది. ఊళ్ళోని ముసలీ ముతకా వాళ్ళ చిన్నప్పుడు విగ్రహం గురించి విన్న కథలన్నీ తవ్విపోసుకుంటున్నారు. చాలా పల్లెటూళ్ళలగానే ఏమన్నా జరిగితే సమస్య పరిష్కారం కోసం తమ బలాన్ని నమ్ముకున్నారే గానీ పోలీసుల కోసం పరిగెత్తలేదు.
రమణాచారి ఊరి నుండి వచ్చాక పెదబాబు, ఆయన, పూజారి గారు కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించటం మొదలెట్టారు. పూజారి గారు చెప్పినట్టు పెంచలయ్య వారసులు ఊరేగింపులో పాల్గొని దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడసలు వాళ్ళ వంశస్థులు ఎక్కడున్నారో ఏమిటో ఎవరికీ తెలియదు. వారిని వెదకటానికి గట్టి ప్రయత్నం చేయాలని నిశ్చయం జరిగింది. నిజానికి వాళ్ళు పెంచలాపురంలోనే వుండాలి. కానీ కాలక్రమంలో పక్క ఊళ్ళకి ఏమన్నా చేరారా అనేది కనుగొనే ప్రయత్నం మొదలైంది. విగ్రహం సంగతి ఏం చెయ్యాలో పాలుపోలేదు వాళ్ళకి. ఇది ఒకటి రెండు రోజుల్లో తేలే వ్యవహారంలా అనిపించలేదు.
ఈ సందడి ప్రభావం కిరీటి నిక్కీలను బాగా ఇబ్బంది పెట్టింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా కలుసుకోవడానికి అవకాశాలు మృగ్యం అయ్యాయి. ఎప్పుడన్నా కలుసుకుంటే శైలు ఇంట్లో కలవడమే. కానీ ఇల్లంతా పాలెగాళ్లతో నిండిపోవడంతో అక్కడ కూడా ఏకాంతం అనేది అరుదుగా