ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 32 33
ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 32 33 ఇదేదో విఠలాచార్యగారి గ్రాఫిక్స్ బొమ్మ చూసినట్టుంది అనుకుంటూ సుర్రుమని సిగరెట్ చివర వేలుకు కాలేసారికి దాన్ని విసిరేసి, ఇంకోటి వెలిగించి కిందపడేసిన గ్లాసు ముక్కలు ఏరుతుండగా పారూ సిగ్గుపడుతూ పైకి వచ్చి “విన్నూ భోజనం రెడీ.. మామ్మ, అమ్మమ్మా రమ్మంటున్నారు” అంటూ గబగబా చెప్పి లటుక్కున కిందకి పరిగెత్తింది. కానీ నడకలో అదే తేడా.. దెబ్బేయించుకున్న తర్వాత దీని నడక బాగానే ఉందిగా…దీని నడకకి ఇప్పుడేమయ్యింది, ఇలా కుంటుతోంది అని అనుకుంటూ గాజుపెంకులు ఏరుతుండగా మళ్లీ షడన్గా ఇందాకటి కన్యలు ముగ్గురూ ప్రత్యక్షం అయ్యారు.
“చూడండి సుందరీమణులారా… నేనో సామాన్య మానవుడిని. పైగా దేవగురువులు నా వల్ల మీకు సహాయం జరుగుతుంది అని చెప్పారు అని మీరు అంటున్నారు. నా నుంచి సహాయం ఆశించి వచ్చాము అంటున్నారు. ముందు మీరు మీ దేవగురువులు దెగ్గరికి వెళ్లి నాగురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ సామాన్య మానవుడి చరిత్రను చూడటం ఆయన దివ్యదృష్టికి చిటికెలో పని. ఆ తర్వాత కూడా మీకు నా సహాయం కావాలి అంటే నాకూ కొన్ని షరతులు ఉన్నాయి. అవి అప్పుడు చెబుతాను. ముందు మీరు ఇక్కడినుంచి వెళ్తే.. నా పని నేను చేసుకుంటాను” అని చెప్పి గాజుముక్కలన్నీ ఏరి చెత్తబుట్టలో పడేసి, సిగరెట్టు పీకలు మెడమీదనుంచి కిందకి విసిరేసి మెట్లగదిలోకి వచ్చి తలుపేసి మెట్లు దిగసాగాను.
ఇంకా సుగంధపరిమళాలు వస్తూ ఉండటంతో.. వాళ్ళు వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నారు అని అర్ధం అయ్యి.. లల్లీ అని గట్టిగా అరిచేసరికి “ఆ చెప్పు” అంటూ పలికింది.. “నువ్వు ఒక్కర్తివే ఒకసారి పైకి రావే” అని అరిచి మళ్లీ వెనక్కి తిరిగి తలుపు తీసి మెడమీదకు వచ్చా. అక్కడ ముగ్గురు సుందరీమణులు తర్జనభర్జనలు పడుతూ కనిపించారు. నేను చూసేసాను అనిచెప్పి అనివేష తప్ప మిగిలిన ఇద్దరూ తల దించుకుని సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకోసాగారు. ఈ లోపు లల్లీ మెట్లెక్కుతూ వస్తూ ఉండేసరికి