ఐశ్వర్య జీవిత కథ 3
సుకన్య,వైశాలి లతో మాట్లాడుతున్నా ఎప్పుడూ నాని అన్నయ్య ప్రస్తావనే ఎక్కువ..వాళ్ళైతే తెగ కలవరించి సిగ్గు విడిచి మాట్లాడేవాళ్ళు అబ్బా మామయ్య ని కొరికేయాలే ఎంత ముద్దుగా ఉన్నాడో అని..ఆ మాటలు,అమ్మలక్కల మాటలు వల్ల నాని అన్నయ్య నాకు ఎప్పుడూ ఒక అన్నయ్య గా అనిపించలేదు, నన్ను ఎంత వారించుకున్నా ఒక "మగాడు" లాగే అనిపించేవాడు నా మనసుకి..
ఒసేయ్ ఐశ్వర్యా అన్న పిలుపుతో ఏంటే సుక్కూ అన్నాను..
ఏమీలేదే ఐశ్వర్యా నువ్వో సహాయం చేయాలే.
ఏంటే చెప్పు??నాకు చేతనైతే చేస్తాను..
ఏమీలేదే ఐశ్వర్యా, నీకు ఎలాగూ నానీ మామయ్య బాగా క్లోజ్ కాబట్టి మా ఇద్దరి విషయం మావయ్య చెవిలో వెయ్యవే బాబూ,ఏదో ఒక విషయం తెలుస్తుందిగా ..
అమ్మో అన్నయ్య తోనా??తెలిసి కూడా ఇలా చెప్పమంటావ్ ఏంటే సుక్కూ???నాకు అంత ధైర్యం లేదు నన్నొదిలేయ్ అన్నాను.
అబ్బా ఇది పెద్ద తింగరిదే వైషూ,ఏ సహాయం చేయదు ఏదో నాని మావయ్య దీని సొంత మొగుడు అయినట్లు అని విసుక్కుంది సుకన్య..ఆ మాటకి నాకు నవ్వొచ్చింది, వెంటనే ఒసేయ్ నాకు స్వంత మొగుడు అయ్యే ఛాన్స్ లేదని నీకు తెలుసుగా?ఎందుకు అలా అంటావ్??అంతలా ఉడుక్కోకు, వీలైతే ప్రయత్నిస్తాను అన్నాను.