వంశాచారం 34
naa telugu kathalu వంశాచారం 34 ఆ ఇద్దరమ్మాయిలు ఒకరి ముఖాలు ఒకరు తృప్తిగా చూసుకొని ఆ మండపం లో ఇంకా కొన ఊపిరితో మిగిలిన కాముడిని గంగడిని కూడా చంపేసి మళ్ళీ. విక్రముడు ముందుకు వచ్చి నిలుచుని వాడి మొహానికి వున్న గాయాలను నీలికళ్ళ అమ్మాయి తుడవసాగింది. వీరిని తానెప్పుడూ చూసి ఉండ లేదు. వారి స్పర్శ లో చూపులో తెలియని ప్రేమ వుంది. కానీ ఇప్పుడు వీరిని చూసి బయపడాలో లేదో కూడా అర్థం కావట్లేదు విక్రముడికి.
ఇన్ని హత్యలను చూసి వణికిపోయివున్న విక్రముడు .. ధైర్యాన్ని కూడతీసుకొని వారిని ఉద్దెశించి
ఎవరు మీరు ?
ఎక్కడి నుంచి వచ్చారు ?
ఎందుకు వచ్చారు? అని వణుకుతున్న స్వరం తో ప్రశ్నించాడు.
తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనం గా వున్న ఆ ఇద్దరికి సుసేనుడిని చూపిస్తూ మీకు ఏ అపకారం చెయ్యని వీడిని