అమ్మాయి ప్రేమ పరిణయం 3
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 3 "ఓకే చేతన్ యు మే లీవ్""యస్ సర్" అని చెప్పి చేతన్ అక్కడనుండి బయటకి వచ్చేశాడు."కూర్చోండి"చేతన్ అక్కడే ఉన్నాడని అప్పటిదాకా ఏం మాట్లాడలేదు. చేతన్ వెళ్ళిపోయిన వెంటనే అడిగింది."మీరు ఇక్కడ.." అంది ముక్త ఆమెకింకా షాకింగానే ఉంది"అబ్బా మీరు మరీ అంతలా షాక్ అవ్వకండి నేను ఇక్కడ మానేజర్ ని" అన్నాడు సంజయ్."అవునా.... మరి మనం ఇన్నిసార్లు కలిసాం కానీ ఈ ఆఫీస్ కి మీరే మానేజర్ అని కనీసం మాటవరసకైనా చెప్పలేదు""చెప్తే మీరు ఇంత షాక్ అవ్వరుగా అందుకే" అన్నాడు సరదాగా ఆమె కూడా నవ్వి "నిజమే" అంది"రండి మీకు ఆఫీస్ లో స్టాఫ్ ని పరిచయం చేస్తాను" అని చెప్పి ఆమెని బయటకి తీసుకెళ్లాడుఆఫీస్ లో అందరినీ ఆమెకి పరిచయం చేశాడు. ఆమె ఆఫీస్ లో ఎలాంటి పనులు చెయ్యాలో వాటి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఒక పది రోజులు చేతన్ తో కలిసి పని చెయ్యండి అప్పుడు మీకు ఇక్కడ వర్క్ అదీ అలవాటవుతుంది ఆ తరువాత మీరేం చెయ్యాలనేది నేను చెప్తాను అని చెప్పి