కామాంధుడి కిరాతకాలు 9
telugu kathalu stories novels కామాంధుడి కిరాతకాలు 9 "హాయ్.. మనీషా. కమాన్.." అంటూ ఒక్క ఉదుటున డోర్ తెరిచాడు నాగ్వీర్.మెడికల్ క్యాంప్‌లో ఒకసారి, ఏర్పోర్ట్లో రెండోసారి కనిపించిన వ్యక్తి.. ఇప్పుడు మూడోసారి చెన్నైలో సడెన్‌గా కనబడడంతో ఎంతగానో ఆశ్చర్యపోయింది మనీష. ఇప్పుడు ఏ మాత్రం సంకోచించే మూడ్‌లో లేదామె. కనీసం అంబ్రెల్లా కూడా లేకుండా, సెల్‌ఫోన్ ఛార్జింగ్ అయిపోయి, ఏమీ తోచని స్థితిలో ఉంది."ఫుల్‌గా తడిచిపోతున్నావ్.. క్కమాన్ ఐ సే.." అని గట్టిగా మళ్ళీ అరిచాడు నాగ్వీర్.ఈ పరాయి ప్రాంతంలో అతని గొంతూ, కళ్ళూ ఆమెని ప్రేమగా పలకరిస్తున్నాయి. వెంటనే ఏం ఆలోచించకుండా నాగ్వీర్ కారులోకి ఎక్కేసింది మనీష. మరుక్షణం నాగ్వీర్ చేతులు ఎంతో హుషారుతో స్టీరింగ్ మీద గట్టిగా బిగిశాయి.ముల్లుల్లా గుచ్చిన జోరువాన నుంచి రిలాక్స్ అవుతూ కళ్ళ మీది నీటి చుక్కల్ని వేళ్ళతో తుడుచుకుంది మనీష.సీట్ మీదున్న టవల్ని తీసిచ్చాడు నాగ్వీర్.థ్యాంక్స్.." అని టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ, ఆఫ్ అయిపోయిన