మొండి 26 ఏజెంట్ వీరు
telugu stories kathalu novels మొండి 26 ఏజెంట్ వీరు ఢిల్లీ నుండి వచ్చిన నెల రోజులకు వీరు కి పోస్టింగ్ కన్ఫర్మ్ చేశారు. ఆఫీస్ స్టాఫ్ మధ్యన లాంఛనాలతో అతను తన కొత్త ఉద్యోగానికి సంబందించి ఛార్జ్ తీసుకున్నాడు. ఈ లోపల బీ టెక్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పని కూడా ఒక టీం మేట్స్ కి అప్పచెప్పేసాడు . దివ్య ఏమో వీరు ప్లేస్మెంట్స్ గురించి అస్సలు పట్టించుకోవడంలేదని చాలా కోపంగా ఉంది.దానికి తోడు దివ్య కూడా తన సొంత ప్రాజెక్టు పని లో బిజీ గా తిరుగుతోంది. ఎప్పుడూ తన టీం మేట్స్ తోనే టైం స్పెండ్ చేస్తోంది. ఇంత హ్యాపీ మూడ్ లో కూడా దివ్య తన అసలు మాట్లాడకపోవడం కొంత అప్సెట్ గా అనిపించింది వీరుకి.
ఈ లోపల ఆఫీసు నుుండి పిలుపు వచ్చింది. వీరు ని మొట్టమొదటి సారి ఒక అసైన్మెంట్ కి రమ్మని పిలుపు. డైరెక్ట్ గా కోల్ కత్తా నగరానికి మరో ముగ్గురితో కలిసి వెల్లాల్సి వచ్చింది. NIA డైరెక్ట్రర్ , ప్రొఫెసర్ దేబేంద్ర వీరు కి పలు రకాల జాగ్రత్తలు చెప్పి రెడీ చేశారు. వారం రోజులపాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో అక్కడ ఉన్న వాటికి రియాక్ట్ కాకుండా , ఇచ్చిన పని మాత్రమే చేసి రమ్మని స్ట్రిక్ట్ గా చెప్పారు వీరు కు. ముఖ్యంగా మిగతా ఆఫీసర్లను గమనించమని వారు కేసుని ఎలా డీల్ చేస్తున్నారో చూడమని చెప్పారు. అన్ని తతంగాలు పూర్తి అయ్యాక , అతని ప్రయాణానికి సిద్ధం చేశారు. అశోక్ సింగ్ అనే సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ , జయేంద్ర పట్నాయక్