చిట్టెమ్మ 3
telugu stories kathalu novels చిట్టెమ్మ 3 ఈసారి వాడ్ని తీసుకొని మా ఆవిడ నా కొడుకును చూడానికి వెళ్ళింది. ఆఫీసు నుండి వచ్చాక చెప్పింది. "మన బంటి' గాడికి ఈసారి 'గులాబ్ జామ్' కూడా తీస్తుకెళ్ళాను మీతో పెట్టుకుంటే లాభం లేదని మురళీని తీసుకెళ్ళాను." క్యాజువల్‌గా చెప్పింది కానీ. నా మైండ్ దాన్ని క్యాజువల్‌గా తీసుకోలేదు.
"నే వచ్చేవాడ్ని కదా? అతడ్నెందుకు ఇబ్బంది పెట్టడం." అసహనంగా అడిగాను. "మీతో పెట్టుకుంటే పోయినట్లే. పోయిన వారం కూడా పోలేదు. ప్రతి ఆదివారం "సిట్టింగ్ అంటూ సోది బ్యాచ్ దగ్గరకి వెళ్తున్నారు." అంది నా 'మందు' స్నేహితుల్ని ఉద్దేశించి.
"చిట్టీని తీసుకెళ్ళవచ్చు కదా?..." అన్నాను కోపంగా .
"బావుంది. కూసే గాడిద మేసే గాడిదని చెడ గొట్టిందట అలా వుంటుంది. దాని పని చెడగొట్టడం ఎందుకు? పైగా మేము వెళ్ళిన ఆటో మురళీ ఫ్రెండ్ దేనట." చెప్పింది. అతగాడ్ని అలా పేరు పెట్టి పిలవడం నాకు నచ్చలేదు. పేరు ప్రక్కన 'గాడు తగిలించి మాట్లాడి వుంటే సంతోషించేవాడ్ని వాడేదో తనకి బాయ్‌ఫ్రెండ్ అన్న రీతిలో పలుకు తోంది. అయినా పనీ పాటాలేకుండా పెళ్ళాం సంపాద నతో బ్రతికేవాడు ఒక మనిషేనా? నాలో ఏదో ఈసడింపు దానికి మించి ఏదో జెలసి.
రాత్రుళ్ళు భాను చొరవతీసుకుంటూ వుంటే నా "దేహం సహకరించడం లేదు. "ఏమైపోయారు మీ మల్లికా షెరావత్ లు.. ముమైత్‌ఖాన్‌లు, తెల్లారగట్ల వరకు ప్రాణం తీసి వదిలేవారు కదా. ఇప్పుడిలా జావగారుతున్నా రేంటి?." అడిగింది. నేను సీరియస్‌గా ముఖం పెట్టి. "నీకు సల్మాన్ ఖాన్.. అభిషేక్ బచ్చన్లు గుర్తుకొస్తున్నారా." అన్నాను. మా ఆవిడ నా పెదాలను జుర్రుకుంటూ, "వాళ్ళందరి కంటే నా మొగుడే