సుపుత్రుడు 2
telugu stories kathalu novels సుపుత్రుడు 2 మొన్న కాయకోసుకోనా అనడిగినప్పుడు, బావుంది అని చెప్పినప్పుడు,.. వాడిలో ఉన్న చనువు ఇప్పుడులేదు. అంటే ఆ రోజు- కోతుల్ని తరిమేపని చేశాను కాబట్టి అడగొచ్చు అనే భావమా..? ఆ లేతమనసుకే అంత అభిమానమా..!
కొత్త ఊరనికూడా లేకుండా ఆ వయసులోనే ఎంత చురుకు..! పండు కోతులనీ చూడకుండా బాణాలేస్తూన్న ఆ కళ్ళలో ఎంత ఆత్మవిశ్వాసం..!
కళ్ళకి చాలా మామూలుగా కనిపిస్తున్న వాడిలో ఏదో ప్రత్యేకతుందని బలంగా అనిపిస్తోంది నాకు.
రోజూ ఓ పూట భోజనానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి పిలిపించాను వాణ్ని.
"అన్నం తిన్నావా..?" అనడిగాను.
ఏం మాట్లాడకుండా చుట్టూ చూశాడు.
నాకర్థమైంది వాడేం తినలేదని. "అన్నం తిందువు.. కాళ్ళూ చేతులు కడుక్కురా.." అని లోపలకు వెళ్ళాను.
కంచంలో అన్నం కూరా పచ్చడీ వేస్తుంటే ఎంచేతో చేతులు వణికాయి. ఎందుకీ వణుకు..? మనసు కదిలిందా..? వయసు పెరిగిందా..?
గ్లాసుతో నీళ్ళూ, అన్నంపళ్ళెం తీసుకునొచ్చేవరకూ వాడు అలా.. నిలబడే ఉన్నాడు.
నా చేతిలో.. పళ్ళేన్నీ, అందులోని వాటినీ చూడగానే వాడి కళ్ళల్లో నీళ్ళు..!
బాగా ఆకలితో ఉన్నాడా..? ఇవి తిని చాలా