మొండి 43 పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ
telugu stories kathalu novels మొండి 43 పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ మసూద్ భాయ్ పేరు చెప్పగానే నబీ రసూల్ ఊరఫ్ వీరు కి ముఖం వెలిగిపోయింది. నటన పరాకాష్టకు చేరిపోయింది. వీరు ని చూసిన కమాండర్
" రాత్రి నిన్ను సాబ్ కి పరిచయం చేస్తా. రెడి గా ఉండు. దేవుడి దయ బాగుంటే ఇండియా లో ఆపరేషన్స్ కి నిన్నే పంపిస్తాం"
మరి కాసేపు మాట్లాడాక అక్కడ నుండి వేరే పని ఉందంటూ వెళ్ళిపోయాడు అతను. అదే అదను అనుకుంటూ వీరు తన లక్ష్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.
మొత్తానికి సరిహద్దుల్లో ఉన్న తీవ్రవాదులు అందరూ విరామం తీసుకోవడానికి అణువుగా వారిని బాలకొట్ లో ఉన్న ఒక పెద్ద హోటల్ కి తరలించారని అర్ధం అయ్యింది వీరు కి. రాత్రికి అక్కడికి మసూద్ భాయ్ చేరుకుంటాడు. ఆ విషయం తాను ఎలాగైనా ఇండియా కి చేరవేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాడు. తను అక్కడ ఉండి చెయ్యాల్సిన పనులు ఏమున్నాయా అని ఒక క్షణం ఆలోచించాడు. ఇప్పటికే వీరు బోర్డర్ దాటి వచ్చి. రెండవ రోజు దాటింది. ఇక్కడ తనకు అప్పచెప్పిన పని పూర్తయ్యింది. కాబట్టి ఇండియాకి తిరిగి వెళ్లి జరిగింది రిపోర్ట్ చెయ్యాలి.
తనకి ఇచ్చిన కిట్ లో ఫోన్ ఆన్ చేసాడు వీరు. కొత్త మోడల్ రెడ్ మీ ఫోన్. ఇన్స్టాల్ చెయ్యాల్సిన సాఫ్ట్వేర్ లు పూర్తయ్యాక. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ప్రదేశాన్ని చెక్ చేసుకున్నాడు. తానున్న ప్రదేశాన్ని మార్క్ చేసుకున్నాడు. మిగతా తీవ్రవాదులతో తో కబుర్లు చెప్తూ మిగతా స్థావరాల వివరాలు కూడా నోట్ చేసుకున్నాడు. రాత్రి మసూద్ వచ్చే సమయానికి ఇండియా వారు ఏదైనా చేస్తే శాశ్వతంగా జైష్ ఉగ్రవాద సంస్థ రూపు లేకుండా పోతుంది.
ఆలోచన వచ్చింది తడవు, గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ చూసుకున్నాడు వీరు. కాన్షియాన్ అనే అటవీ ప్రాంతం చేరుకుని అక్కడ నుండి దోమాలియా ఖటా అనే నదిని