నల్లమ్మాయి 2
telugu stories kathalu novels నల్లమ్మాయి 2 ఆమె మాటలకి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నవ్వారు. ''సరేనే దాని గొడవ మనకెందుకు గానీ... ఆ వెంకట్ గాడు నాలుగు రోజులుగా నీ చుట్టూ తిరుగుతున్నాడు ఏమిటే సంగతి...?'' అని అడిగింది మోహిని స్మితని.
''ఆ... ఏముంది. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడుట... నేను లేనిదే బ్రతకలేడట... నువ్వు ఊ అంటే ఈ ప్రపంచాన్నే జయిస్తాను... కాదంటే ఈ ప్రపంచంలోనుండే శాశ్వతంగా వెళ్ళిపోతాను... అంటూ బలమైన డైలాగ్స్ వ్రాశాడే...'' అంది గర్వంగా మొహం పెడుతూ స్మిత.
''మరింకెందుకు ఆలస్యం... వాడికి ఐ లవ్ యూ చెప్పేసెయ్...'' అంది సంపద. '
'మరి వాడికి ముందు లవ్ లెటర్స్ ఇచ్చిన ఆ కిరణ్ స్వామి, మూర్తి, మోహన్ లని ఎం చేయమంటారే?'' అంది నవ్వుతూ.
''వామ్మో... ఇంత మంది నీ వెంటపడుతున్నారన్నమాట... చూశావా రాజీ... ఇలా అబ్బాయిలను మన చుట్టూ తిప్పుకోవాలి కానీ... మనమే వారికి లవ్ లెటర్స్ వ్రాస్తే వారి ముందు మనం చులకన అయిపోతాం... దానికి మొత్తం ఆరు మంది లవ్ ప్రపోజ్ చేస్తే, నాకు నలుగురు వ్రాశారు. మరో ముగ్గురు ఆ పనిలో బిజీగా ఉన్నారు. మరొకడు రోజూ మా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు... నా సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ...'' అంది గర్వంగా మోహిని.
''నా వెంట కూడా నలుగురయిదుగురు వెంటపడుతున్నారే'' అంది సంపద కూడా...
''బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతున్నట్లు వారు మా చుట్టూ తిరుగుతున్నారు... నువ్వు బెల్లానివే అయినా ఆ ఈగలకు పనికిరాని దానివి... అందుకే వారు నీ జోలికి రావడానికి జంకుతున్నారు.... ఇకనైనా అబ్బాయిల గురించి ఆలోచనలు మానుకో...'' అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చేసి ముగ్గురూ