మొండి 58 నవాజ్ భాయ్
telugu stories kathalu novels మొండి 58 నవాజ్ భాయ్ దివ్య ఫ్లైట్ ఎక్కి ఒంటరిగా కూర్చుని కిటికీ వైపు చూస్తోంది... కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా బయటకి రాకుండా ఆపుకుంటోంది... దానికి తోడు ఎదురుగా పెళ్ళైన ఒక జంట.. ఆ అమ్మాయి కన్నా అబ్బాయి బాగున్నాడు... ఆ అమ్మాయి అతని భుజం పై తల పెట్టి కబురు చెబుతోంది....ఆ రొమాన్స్ చూడలేక మొహం పక్కకి తిప్పకుంది దివ్య... దివ్యకి వీరు మీద కోపం. మరో పక్కన ఏమైపోతాడో అన్న భయం... ఇవన్నీ కలిసి లోలోపల తిరుగుతున్నాయి.... వీరు చేసే ఉద్యోగం నిజంగా అంత రిస్క్ ఉన్నదా?? రేపు నా వల్ల వీరుకి ఏదైనా అయితే ఎలా? అన్న బాధ... ఇవన్నీ కళ్ళల్లో తిరుగుతున్నాయి... తెల్లని ఆమె పెద్ద కళ్ళ నుండి కన్నీళ్లు ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి....తన శ్వాస కూడా తనకే వినిపిస్తోంది....
వీరు ఏమవుతాడు.... వీరు కోసం ఇంత ఎక్కువ భయపడుతున్నానేమో.... "లవర్ తో కూడా ఎలా ట్రీట్ చెయ్యాలో తెలియదు వీడికి" అని అనుకుని... ఈ లోపల మబ్బులు ఎదురుగా కనపడ్డాయి.... ఆ మబ్బులు... ఆకాశం ని విమానం కిటికీ నుండి చూస్తూ హైదరాబాద్ కి బయలుదేరింది...
**************
సరిగ్గా అప్పుడే... చైతన్య క్యాబ్ దిగి లక్డీ కపూల్ లోకి ఎంటర్ అయ్యాడు.... మొఘల్ హోటల్ లో బిరియాని తినడానికి గర్ల్ ఫ్రెండ్ తో సహా వచ్చాడు.... దానికి 50 అడుగుల దూరంలో సెన్సేషన్ థియేటర్ ఉంది... అక్కడే వీరు .. ఊరఫ్ చైతన్య గురించి ఎంక్వైరీ జరుగుతోంది....
ఆరగంట తరువాత... అదే హోటల్ లో వైటర్ ఏదో ఎక్కువ మాట్లాడి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు చైతు.... ఇదే బట్టర్ ఫ్లయ్ ఎఫెక్ట్ అంటే... గొడవ జరిగినప్పుడు ఒక పాన్ షాప్ ఓనర్ చైతు ని చూడటం... అతని డీటెయిల్స్ చెప్తూ ఉండటం గమనించారు... రెక్కీ కి వచ్చిన రౌడీలు.... అదే విషయం చెప్పారు