మొండి 73 ఒకప్పుడు
telugu stories kathalu novels మొండి 73 ఒకప్పుడు దారి పొడవునా దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాలను బ్లాక్ చేస్తూ వచ్చాను... లాప్టాప్ కి ఈ సెల్ కి కనెక్ట్ చేసి తప్పించాను...
అని చెప్పి చివరి గా మాస్క్ తీసేసాడు వీరూ...ఒరిజినల్ గెట్ అప్ లో ఉన్నాడు ఇప్పుడు.. నిన్ను ఖచ్చితంగా గుర్తుపట్టి ఉంటారు రాజేష్.. అందుకే సేఫ్టీ కోసం ఇక్కడికి తెచ్చా.. నువ్వు తీసుకొచ్చిన ప్లేస్ ఏ... అని లైట్ ఆన్ చేసాడు.. అప్పట్లానే పాతబడిపోయి గబ్బిలాలతో ఉంది ఆ స్టేషన్ . అక్కడే ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి బూజు పట్టిన మెష్ తలుపు తీసాడు... అందులో టికెట్లపై గుద్దే date స్టాంప్ తీసి ఒక పేపర్ తీసి గుద్దాడు వీరు... వెంటనే రాజేష్, దివ్య ల పక్కన ఒక లైట్ వెలిగింది... ఆ పేపర్ పట్టుకొచ్చి... పట్టాల మీదుగా లోపలికి నడిపించుకుంటూ వెళ్ళాడు వీరు... రాళ్లు, గుట్టలుగా పడిపోయి ఉంది ఆ ప్రాంతంలో.. ఆశ్చర్యంతో చూస్తున్నారు దివ్య, రాజేష్...
ఆ రాళ్లు దాటుకుని వెళ్తే లోపల ఒక తుప్పు పట్టిపోయి వదిలేసిన ఒక రైల్వే బోగీ కనిపించింది.. అరక్కోణం లో తయారు అయినట్టు రాసి ఉంది ఆ బోగీ మీద.. దాదాపు 45 అయిదు సంవత్సరాల క్రితం ఉన్న భోగీలా ఉంది.. ఆ బోగీ తలుపు దగ్గర ఆ స్టాంప్ గుద్దిన పేపర్ పెట్టాడు వీరు.. డోర్ తెరుచుకుంది... బోగీ లోపలికి తీసుకు వెళ్ళాడు వీరు...
ఆ బోగీలో చల్లగా ఉంది... బయటకు ఎయిర్ కండీషన్ అటాచ్ అయ్యి ఉంది.. కరెంట్ ఎలా వస్తుందా అని చూస్తే... బయట పెద్ద పెద్ద బ్యాటరీ లో కలిపి ఉన్నాయి... అలాగే మనుషులు కూర్చునే సీట్లలో పెద్ద పెద్ద సర్వర్లు ఉన్నాయి... శత్రువులు ఇండియా పై మారణాయుధాలు తయారు చేస్తే వీరు శత్రువుల కోసం తయారు చేసిన మరణాయుధం