ఆ రోజు ఏం జరిగిందంటే 1
telugu stories kathalu novels ఆ రోజు ఏం జరిగిందంటే 1 నీ వల్ల కాదు…” ఆవేశంగా అన్నాడు మోహన్.
అతని మాటలకి పెద్దగా నవ్వింది వాణి…” ఈ వాణి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఈ విషయంలో కూడా అంతే… నేను మనసు పెట్టి రంగంలోకి దీగాలే కానీ… ఇక ఆ పని జరగకపోవడమంటూ ఉండదు …” స్ధిరంగా అంది వాణి.
”అయితే చూద్దాం… నీకు నేను వారం రోజులు గడువిస్తున్నాను… నువ్వేం చేసినా ఈ వారంలోపే చేయాలి… అలా చేయగలిగితే నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను…” అన్నాడు మోహన్…
మళ్ళీ నవ్వింది వాణి…”అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు” అంది…
”అబ్బా అచ్చు కుందనపు బొమ్మలా ఉన్నావు తెలుసా…?” సుప్రియని చూస్తూ మెచ్చుకోలుగా అంది వాణి.
ఆమె మాటలకి సుప్రియ సిగ్గుతో ముడుచుకు పోయింది…
”అబ్బో సిగ్గే…! అయినా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు నా కంటే అందంగా వున్నావు తెలుసా?” అంది ఆమెని మరింత పొగుడుతూ…
ఈసారి వాణి వైపు సీరియస్ గా చూసింది సుప్రియ ”అవును… నీ కంటే కాదు… ఈ లోకంలో ఉన్న ఆడాళ్ళందరి కంటే నేనే అందంగా ఉంటాను…”
”వింటున్నాను కదా అని మరీ ఇలా విడ్డూరంగా మాట్లాడటం ఏమీ బావో లేదు…” అంది సుప్రియ.
వాణి చిన్నగా నవ్వుకుంది సుప్రియని చూసి, ”అవునులే, ఆడదాని అండం గురించి మరో ఆడది పొగిడితే విడ్డూరంగానే అనిపిస్తుంది… అదే ఏ మగాడో ఎదురుగా వచ్చి భావావేశంతో నీ అందాన్ని వర్ణిస్తుంటే తెగ సంబరపడిపోతావు” ఆమెని ఉడికిస్తున్నట్టుగా అంది వాణి.
”నా ఎదురుగా మరో మగాడు వచ్చి నా అందాన్ని పొగడమా? అలా గాని జరిగితే వాణ్ని చెప్పుతో కొడతాను” కోపంగా అంది సుప్రియ.
”అయ్యో పాపం… నీ అందాన్ని పొగడం కూడా వాళ్ళు చేసిన తప్పేనా? అంది వాణి…
”తప్పా… తప్పున్నరా… అయినా ఒక పెళ్ళయిన ఆడదాని ముందుకి ఎవడైనా వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగిడేస్తే వాడి మాటలకి పొంగిపోతాననుకుంటున్నావా? నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కి