అమ్మాయి ప్రేమ పరిణయం 1
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 1ఇండియాలో టాప్ ఫిఫ్టీ అడ్వర్టైజింగ్ కంపనీస్ లో అది ఒకటి. ఆ కంపనీ ని రఘుపతి గారు మొదటిసారిగా పాతికేళ్ళ క్రితం పెద్ద స్థాయిలో హైదరాబాద్ లో తన మనవడి పేరున ప్రారంభించారు. అంతకు ముందు పదేళ్ళవరకు ఆయన ఆ ఫీల్డ్ గురించి బాగా స్టడీ చేశారు. చాలా కంపనీస్ తో కలిసి పని చేశారు. కొన్ని చోట్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయిపోతే ఇంకొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కొక్క చోట ఒక్కొక్క కొత్త అనుభవం ఎదురయ్యేది. ఆయన అవన్నీ తట్టుకొని నిలబడ్డారు. ఆ ఫీల్డ్ లో చాలా అనుభవం సంపాదించాక ఆయన నలభయ్యవ సంవత్సరాల వయసప్పుడు ఈ కంపెనీ ని ప్రారంభించారు. మొదట్లో పోటి కంపనీల నుండి చాలా ఇబ్బందులను, చాలా ఒత్తిళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటినన్నింటిని దాటుకొని ఆయన ఈ కంపెనీని నిలబెట్టారు. అది ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి చాలా వరకు కారణం ఆయనే.యశ్వంత్ చిన్నప్పటినుండి తన