అమ్మాయి ప్రేమ పరిణయం 25
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 25 ముక్త ఆ రోజైనా యశ్వంత్ తో అయిదు లక్షల గురించి మాట్లాడదామనుకుంది. పొద్దున్న రాఘవ రావు గారిని అడిగితే యశ్వంత్ ఇంకా ఆఫీస్ కి రాలేదని చెప్పారు. సంజయ్ గురించి చూస్తుంటే అతను కూడా పొద్దుటినుండి కనబడట్లేదు. ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఇవాళో రేపో డబ్బు చేతికందితే ఈ వారం ఊరికి వెళ్దామనుకుంటోంది. లంచ్ బ్రేక్ తరువాత సంజయ్ ఆమెకి కనిపించాడు. అతను కనిపించగానే అతని క్యాబిన్ కి వెళ్ళింది.
"ఏంటి లంచ్ అయ్యిందా"
"హా..."
"ఏంటి డల్ గా ఉన్నావు."
"బాస్ తో మాట్లాడాలి ఇవాళ కుదురుతుందా"
అసలే యశ్వంత్ కి మూడ్ బాలేదు ఈ టైం లో ముక్త వెళ్ళి మాట్లాడిందంటే చాలా కష్టం.
"విషయమేంటో చెప్పు..."
"కొంచం కాంఫిడెంషియల్...బాస్ అపాయింట్మెంట్ కావాలి"
"అబ్బో...సరేలే గానీ ఇవాళ కుదరకపోవచ్చు ఆయన చాలా బిజీ గా ఉన్నారు."
"ఎలా అయినా ఇవాళ అపాయింట్మెంట్ తీసుకోవా ప్లీస్"
"అహ లాభం లేదు ఇవాళ కుదరదు కావాలంటే రేపు మాట్లాడు."
"రేపా"
"ఆ"
ఆమె అయిష్టం గా "సరే" అని వెళ్ళిపోయింది. సంజయ్ కి ముక్త ప్రవర్తన అర్ధం కాలేదు. ఏంటి ఇవాళ విచిత్రంగా బిహేవ్ చేస్తోంది అనుకున్నాడు.
యశ్వంత్ ఆమె సైన్ చేసిన డాక్యుమెంట్స్ చూపించేసరికి ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేసింది. ఈ యాడ్ ని డిలే చేస్తే ఆమెకే నష్టం అని ఆమెకి అర్ధం అయ్యింది. అందుకే ఎలాంటి పేచీ పెట్టకుండా యాడ్ ని పూర్తి చేసింది. సాయంత్రం ఏడయ్యేటప్పటికి యాడ్ ని పూర్తి చేసారు. షూట్ అయిపోయాక ఆకాంక్ష యశ్వంత్ ని కలుద్దామనుకుంది కానీ కుదరలేదు. ఆమెని కలవడానికి యశ్వంత్ ఇష్టపడలేదు. ఆఫీస్ లోనే ఉన్నా కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో కోపంగానే అక్కడనుండి వెళ్ళిపోయింది. ఆమెని పంపించాక సంజయ్ వచ్చాడు యశ్వంత్ దగ్గరికి "ఆకాంక్ష చాలా కోపంగా వెళ్ళింది. ఒక్కసారి కలిసుంటే పోయేదేమో"
"ఆమెతో మాట్లాడితే మూడ్ అంతా పాడయిపోతుందిరా. అసలు ఇవాళ ఆఫీస్ కి రాకూడదనే అనుకున్నా కానీ ఆమె చేసిన గొడవ వల్ల రావాల్సి వచ్చింది. సరేలే ఆ విషయం వదిలేయి ఎలా వచ్చింది యాడ్"
"నీ మీద కోపం ఉన్నా యాడ్ మాత్రం బానే చేసింది. ఇంకా ఏవో చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉంటే మకరంద్ చూసుకుంటున్నాడు"
"సరే పద వెళ్దాం. ఇంటికొస్తావా తాతయ్య