అమ్మాయి ప్రేమ పరిణయం 26
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 26 ఆమె వెంటనే ఇంకేం ఆలోచైంచకుండా "ఆ చెక్ చినిగిపోయింది సర్" అంది అతను అలా వెళ్ళిపోవమని చెప్పడంతో.
"నీకు నచ్చిన సంగతులు మాత్రమే గుర్తు పెట్టుకొని నచ్చని సంగతులని నీకు నచ్చినట్టు మార్చుకోవడం నీకు అలవాటా.. ఆ చెక్ చినిగిపోలేదనుకుంటా నువ్వే చింపేసినట్టు గుర్తు" అన్నాడు
ఆమె తడబడుతూ "అంటే అప్పటికి నేనింకా ఒప్పుకోలేదు కదా సర్" అంది నెమ్మదిగా.
"మరి నువ్వూ చేద్దామనుకున్నాక ఆ విషయం నాకు చెప్పలేదుగా..పైగా రెమ్యూనరేషన్ గురించి కూడా అడగలేదు... అలాంటప్పుడు నువ్వు ఆ స్టిల్స్ చేసావని నాకెలా తెలుస్తుంది."
"అదేంటి సర్ అలా అంటారు సంజయ్ సర్ చెప్పారుగా నేను ఓకే అని చెప్పా అని" అంది
"అవును చెప్పాడు. కానీ నీకు రెమ్యూనరేషన్ ఇవ్వాలనేం చెప్పలేదే. నీకు రెమ్యూనరేషన్ కావాలంటే అడిగేదానివి కానీ దాని గురించి ఏం అడగలేదు...సో నువ్వు ఫ్రీ గా చేస్తున్నావేమో అని అనుకున్నా"
ఆ మాటతో ఆమె నోరెళ్ళబెట్టింది. కోపంగా "ఫ్రీగా చెయ్యడమేంటి సార్. నా రెమ్యూనరేషన్ నాకు కావాలి"
"అదేమయినా చిన్న చాక్లేటా..నా చాక్లేట్ నాకు కావాలి అనగానే తీసుకో అని ఇచ్చేయడానికి. అయినా నీకు డబ్బు మీద గౌరవం లేక నీ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే దానికి నేనేం చేస్తా"
"నాకు డబ్బు మీద గౌరవం లేదా..వామ్మో ఈయనేంటి టాపిక్ ని ఎక్కడ నుండి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అసలు రెమ్యూనరేషన్ ఇచ్చే ఉద్ద్యేశం ఉందా లేదా.." అని ఆలోచనల్లో ఉన్న ముక్తకి
"ముక్తా అయాం బిజీ" అని యశ్వంత్ అనడం వినిపించింది. అప్పటికే ఆమె వచ్చి అరగంట దాటిపోయింది. యశ్వంత్ ఒంటిగంటకి ఒక క్లైంట్ నుండి కాల్ కోసం ఎదురుచూస్తున్నాడు.
"అంటే వెళ్ళిపోమంటున్నాడా..నా రెమ్యూనరేషన్ ఎగ్గొట్టేస్తాడా ఏంటి" అనుకొని కోపంతో
"నేను బిజీయే సర్ నాకు వర్క్ ఉంది...నా రెమ్యూనరేషన్ నాకిచ్చేస్తే వెళ్ళిపోతా" అంది సూటిగా
అంత సూటిగా మాట్లాడిన ముక్త వైపు చూడకుండా ఉండలేకపోయాడు. తల పైకెత్తి ఆమెని చూసి నవ్వుతూ "ఇవ్వకపోతే" అన్నాడు
"అలా ఎలా ఇవ్వరు సార్ నేను స్టిల్స్ తీసి ఇచ్చా కదా..మీరూ ఇవ్వాలి కదా"
"అలా అని ఎక్కడైనా రూల్ ఉందా.. అయినా ఇస్తేనే గా వద్దని చింపేసావు..ఒక్కసారి వద్దని అంత గట్టిగా చెప్పాక మళ్ళీ నీకు కావాలనప్పుడు దొరుకుతుందని