అమ్మాయి ప్రేమ పరిణయం 41
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 41 "ఏడిసినట్టు ఉంది..వెళ్లిపోవచ్చు అంటే నువ్వు వెళ్లిపో అని అర్ధం కానీ..నేను నిన్ను డ్రాప్ చేస్తాను అనే అర్ధం ఎక్కడుంది... అతను అలా చెప్పానని ఊహించుకున్నాడేమో..ఏంటో అతనేం ఊహించుకుంటున్నాడో కూడా అవతలి వాళ్ళే కనిపెట్టాలనుకుంట..ఖర్మ"
"ఏంటి ఇలా ఆలోచిస్తూనే ఉంటావా..వచ్చే ఉద్దేశం లేదా"
"వస్తున్నా సర్" అంది ఆమె బ్యాగ్ తీసుకొని వెంటనే.
ఇద్దరూ కిందకి వచ్చి కార్ లో కూర్చున్నారు. కార్ ని స్టార్ట్ చేస్తూ అడిగాడు "ఎక్కడ ఉండేది"
"మాధపూర్" అంది.
కార్ ని మాధాపూర్ వైపు పోనిస్తున్నాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. దారిలో అక్కడక్కడ కనిపిస్తున్న మొబైల్ టిఫిన్ సెంటర్ల వైపు ఆశగా చూస్తూ పొట్ట తడుముకుంటూ అనుకుంది ముక్త. "అబ్బా ఆకలేస్తోంది...ఇప్పుడు ఇంటికెళ్ళినా ఫుడ్ ఏం ఉండదు...చరిత వాళ్ళు పార్టీలోనే తినేసి వచ్చుంటారు. ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఎక్కడైనా ఆపితే బావుండు"
అతను ఆమె వైపు చూస్తూ అన్నాడు "ఏంటి ఆకలేస్తోందా" అని
అంతే అతనడిగిందే ఆలశ్యం అని "అవును సర్...ప్లీజ్ మీరేమనుకోకపోతే ఎక్కడైనా టిఫిన్ సెంటర్ దగ్గర ఆపండి తినేసి వస్తా" అంది
అతను నవ్వుకుంటూ కార్ ని ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆపాడు. కిందకి దిగి వెళ్ళడానికి భయమేసినా అతన్ని టిఫిన్ తెమ్మంటే ఏమంటాడో "నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను...నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి...నీకు టిఫిన్ తెచ్చిపెట్టి...నీకు పనులు చేసే వాడిలా కనిపిస్తున్నానా" అని అంటే అమ్మో ఎందుకొచ్చింది ఏదయితే అది అయ్యిందని కార్ డోర్ మీద చెయ్యేసింది డోర్ ఓపెన్ చేసి దిగడానికి.
"ఏంటి దిగి వెళ్ళి రోడ్ మీద నిలబడి తినేసి వద్దామనే" అని ఆమె మీద నుండి చెయ్యి చాపి ఆమె చెతిని డోర్ మీద నుండి తీస్తూ "నేను తీసుకొని వస్తా ఉండు" అని చెప్పి దిగి