అమ్మాయి ప్రేమ పరిణయం 44
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 44 "నువ్వు నోర్ముయి ఎప్పుడు నాకు తప్ప పక్కవాళ్లకి బానే సపోర్ట్ చేస్తావు. ఇంకో సారి మాట్లాడావంటే చంపేస్తాను" అని వార్నింగ్ ఇచ్చింది అంతరాత్మకి. దాంతో అది నోరు మూసుకుంది.
లిఫ్ట్ లో తన ఫ్లోర్ కి వచ్చి తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆమె కూర్చొని తన బ్యాగ్ ని డెస్క్ మీద పెట్టి సిస్టం ఆన్ చెయ్యగానే "హాయి" అంటూ వచ్చింది సాహితి.
"హాయి" అంది నీరసంగా
"ఏమయింది ఎందుకింత లేట్ గా వచ్చావు. ఒంట్లో బాలేదా" అడిగింది సాహితి
"అదేం లేదు నిన్న లేట్ అయ్యిందిగా అందుకే..."
ఆ మాటలకి సాహితి నవ్వింది "నీకు తెలీదా" అన్నాట్టు
ఆ నవ్వు చూసి చెప్పింది వేద "ఇందాకే తెలిసిందని"
"మరలాంటప్పుడు లీవ్ పెట్టుండాల్సింది ఎందుకొచ్చావు"
"అనవసరంగా లీవ్ వేస్ట్ చెయ్యడం ఎందుకని వచ్చా"
వాళ్ళు మాటల్లో ఉండగానే చేతన్ వచ్చాడు "ముక్త నువ్వు రాగానే సర్ తన క్యాబిన్ కి రమ్మన్నారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ముక్త సాహితి వంక చూసింది.
"లీవ్ వేస్టవుతుందేమో అని వచ్చావు గా...ఆల్ ది బెస్ట్" అంటూ ఆమె సీట్ దగ్గరికి వెళ్ళింది.
వెళ్తున్న సాహితిని గుర్రుగా చూస్తూ యశ్వంత్ క్యాబిన్ కి వెళ్ళింది ముక్త.
డోర్ నాక్ చేసి "కమిన్" అని వినబడేదాకా వెయిట్ చేసింది. వినబడగానే తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది.
ఆమె లోపలికి రాగానే ఒకసారి ఆమె వైపు చూసి "మెయిల్ పెట్టావా" అని అడిగాడు
"మెయిలా..ఏం మెయిల్" అనుకుంది ఆశ్చర్యంగా.
అతను అడిగి నిమిషమయినా ఆమె ఏం సమాధానం చెప్పకుండా అతని వంక ఆశ్చర్యంగా