అమ్మాయి ప్రేమ పరిణయం 46
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 46 లంచ్ తరువాత మళ్ళీ పనిలో పడ్డాడు. అప్పటికే మధ్యాహ్నం రెండు దాటింది. ఈపాటికి చేంజెస్ అయిపోయి మెయిల్ రావాలే ఇంకా రాలేదేంటి అనుకుంటూ మళ్ళీ ఒకసారి మెయిల్ చెక్ చేసుకున్నాడు. ఉహు ముక్త నుండి మెయిల్ రాలేదు. వాళ్ళు సజెస్ట్ చేసిన చేంజెస్ కూడా చిన్నవేనే వాటికి ఇంత టైం కూడా పట్టదు మరి ఇంకా మెయిల్ రాలేదేంటి అని అనుకొని ఇంక లాభం లేదని ముక్తని ఇక్కడికి పిలవమని రాఘవరావు గారికి చెప్పాడు.
వెళ్ళినతను వెళ్ళినట్టే రెండు నిమిషాల్లో తిరిగొచ్చాడు "ముక్త ఇంకా ఆఫీస్ కి రాలేదంట సర్" అన్నాడు
"వాట్ రాలేదా...లీవ్ పెట్టిందా లేకపోతే ఎవరికైనా ఇంఫార్ం చేసిందా"
"లేదు సర్ లీవ్ పెట్టలేదంట...." అన్నాడు
"సరే అయితే తను రాగానే ఇక్కడికి రమ్మని చెప్పండి" అన్నాడు
"ఓకే సర్" అని కదిలారు ఆయన అక్కడనుండి.
ముక్త తో పాటు చరిత, సారిక కూడా సంజయ్ వాళ్ళ నాన్నగారిని చూడడానికి వెళ్ళారు. వాళ్ళు హాస్పటల్ కి వెళ్ళేటప్పటికే పదకొండు దాటింది. అక్కడ ఒక గంట సేపు కూర్చొని సంజయ్ కి చెప్పి బయటకి వచ్చారు. వాళ్ళని గేట్ దాకా పంపించడానికి సంజయ్ కూడా వాళ్ళ వెనకాలే వచ్చాడు. వాళ్ళు బయటకి రాగానే అడిగాడు "ఇవాళ ఆఫీస్ కి వెళ్లట్లేదా" అని
"వెళ్తున్నా"
"ఇప్పుడా...ఇంఫార్ం చేసావా ఎవరికైనా"
"లేదు నిన్న బాగా లేట్ అయిందిగా."
"ఓహో అయితే ఇవాళ లేట్ గా వెళ్ళినా పర్వాలేదనుకున్నావా...అందుకేనా ఇంఫర్ం చెయ్యలేదు. ఇక్కడ అంత లేదు యశ్వంత్ సర్ కి తెలిసిందంటే ముందు నిన్ను ఆ తరువాత నీకు