అమ్మాయి ప్రేమ పరిణయం 48
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 48 అప్పటికే లంచ్ టైం కావడంతో "రా లంచ్ కి వెళ్దాం ఆకలేస్తోంది" అంటూ వచ్చింది సరిత ముక్త దగ్గరకి
"అహ లేదు ఇవాళ నేను బయటకి వెళ్తున్నాను లంచ్ కి. నువ్వెళ్ళు" అంది ముక్త మీటింగ్ గురించి చెప్పకుండా
"బయటకి వెళ్తున్నావా...ఎవరితో" అడిగింది అనుమానంగా ఎప్పుడు ముక్త ఆఫీస్ టైం లో ఎక్కువగా బయటకి వెళ్ళడం చూడకపోవడంతో
దాంతో తడబడింది ముక్త "ఎవరితో కాదు నేనొక్కదాన్నే"
"అదేంటి నువ్వొక్కదానివే వెళ్తావా...నేను కూడా వస్తా ఇద్దరం బయట తినేసి వద్దాం రా...ఎప్పుడు తినే లంచ్ బాక్సేగా....ఇక్కడే ఎవరికైనా ఇచ్చేసి వెళ్దాం" అంది సరిత ఉత్సాహంగా.
సరిత అలా అనేసరికి ముక్త కి ఏం చెప్పి తప్పించుకోవాలో అర్ధం కాలేదు. ఆమె అలా ఆలోచనల్లో ఉండగానే "వెళ్దాం అంటే కదలకుండా అలా ఆలోచిస్తావేంటి రా వెళ్దాం"
"అహ లేదు బయటకి వెళ్తున్నా అంటే కేవలం లంచ్ కోసం మాత్రమే కాదు. నేను మళ్ళీ ఆఫీస్ కి రాను నాకు బయట పని ఉంది అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నా.... లంచ్ బయట తినేసి అటునుండి సిటి అవుట్ స్కర్ట్స్ కి వెళ్ళాలి..కొంచం పనుంది...సో ఇప్పుడు కాదు మనం ఇంకెప్పుడైనా బయటకి వెళ్దాం" అంది నచ్చచెబుతున్నట్టు.
అప్పటికప్పుడు ఆమె నోటికి వచ్చిన అబద్దం చెప్పేసింది కానీ చెప్పాక అనిపించింది "అబ్బా ఇప్పుడు చచ్చినట్టు మీటింగ్ అయిపోయాక ఆఫీస్ కి రావడానికి లేదు ఇంటికి వెళ్ళాలి. అంటే హాఫ్ డే లీవ్ కట్....దాంతో పాటు వాడిని హాఫ్ డే లీవ్ అడగాలి...హ్మ్ం...వాడు ఒప్పుకోవాలిగా ఆఫీస్ కి రానంటే...ఏమంటాడో మహానుభావుడు