అమ్మాయి ప్రేమ పరిణయం 5
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 5 తెల్లవారుఝామున నాలుగు గంటలు అయింది..ఆనంద నిలయం లో సందడి అప్పటికే ప్రారంభమయ్యింది. రఘుపతి గారు అప్పటికే లేచి పనివాళ్ళందరికీ పనులు పురమాయిస్తున్నారు. పనివాళ్ళు ఆ బంగ్లాని రకరకాల దీపాలతో, పూలతో అందంగా అలంకరించారు. ఇంటి ముంగు రకరకాల ముగ్గులతో స్వాగతం పలుకుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఎక్కడో విదేశాల్లో ఉంది ఈ రోజే హైదరాబాద్ కి రాబోతున్న యశ్వంత్ కి ఘనంగా స్వాగతం చెప్పడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రఘుపతి గారు అన్ని దగ్గరుండి చేసుకుంటున్నారు. ఆయన అలాఉత్సాహంగా చిన్నపిల్లవాడిలా తిరుగుతూ ఉంటే పనివాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన వయసు డబ్బయికి దగ్గరలో ఉంటుంది. నిన్నటి వరకూ ఒక లాంటి నిశబ్దం తో ఉన్న ఆ బంగళా యశ్వంత్ రాకతో కొత్త కళను సంతరించుకుంటోంది. ఆ సమయానికి యశ్వంత్ ఫ్లైట్ దిగి