అమ్మాయి ప్రేమ పరిణయం 50
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 50 తెచ్చిన డిషెస్ ని వెయిటర్ ప్లేట్స్ లో సర్వ్ చేస్తున్నాడు. ముందు యశ్వంత్ ప్లేట్ లో సర్వ్ చేసాడు. ముక్త అక్కడ లేకపోవడం తో ఆమె ప్లేట్ లో సర్వ్ చెయ్యాలో వద్దో అతనికి అర్ధం కాలేదు. ఏం చెయ్యడం అన్నట్టు ముక్త వైపు చూశాడు కానీ ఆమె అతని వైపు కాకుండా చుట్టుపక్కలంతా చూస్తూ ఉండడంతో అతనికేం అర్ధం కాలేదు. ఆమెని పిలిచి అడుగుదామనుకున్నాడు. అతను "మేడం" అని పిలిచే లోపే యశ్వంత్ "ఆ ప్లేట్ లో కూడా సర్వ్ చేసి మీరు వెళ్ళండి అవసరం ఉంటే మేము పిలుస్తాం" అన్నాడు. తెచ్చిన డిషెస్ ని రెండు ప్లేట్స్ లో సర్వ్ చేసి వెళ్ళిపోయాడు అతను. అతను వెళ్ళిన వెంటనే ముక్త విసురుగా యశ్వంత్ దగ్గరకి వచ్చి అతని పక్కన నిలబడింది.
"సర్ ఏంటి దీనర్ధం" అంది కోపంగా పేపర్స్ ని అతనికి చూపిస్తూ.
అతను కాంగా తింటూ "ఆ పేపర్స్ ఏంటో నువ్వు చదివావు. ఈపాటికి నీకు విషయం అర్ధమయ్యే ఉంటుంది. ముందు లంచ్ చేస్తే ఆ తరువాత దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు" అన్నాడు ఎటూ తడబడకుండా స్థిమితంగా లంచ్ చేస్తూ
అంత నింపాదిగా మాట్లాడుతూ సమాధానాలు చెప్తున్న అతన్ని చూస్తుంటే ఆమెకి చిరెత్తుకొచ్చింది. "ఏంటి తినేది ఏమనుకుంటున్నారు అసలు నా గురించి క్లైంట్స్ తో మీటింగ్ అని చెప్పి పిలిచి ఇదా మీరు చేసేది. నేనేం మీ లంచ్ కోసం రాలేదు. ఇక్కడ నా ముందు ఇలాంటి ప్రపోజల్ పెట్టి అసలు మీకు సంబంధమే లేనట్టు అంత తీరికగా లంచ్ మీరు చెయ్యగలరేమో నేను చెయ్యలేను. లంచ్ కి పిలిచి ఇంత అవమానిస్తారనుకోలేదు. ఆ లంచేదో మీరే తినండి." అని ఆ పేపర్స్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి బయటకి నడవబోయింది. రెండు అడుగులు వేసిందో లేదో అతనన్న మాటలకి అక్కడే నిలబడిపోయింది.
"నువ్వు ఈ లాంజ్ నుండి బయటకి అడుగుపెట్టావంటే నీ జాబ్ కి రిజిగ్నేషన్ ఇచ్చినట్టే" అన్నాడు స్థిమితంగా. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అతనికి ఆమెని బెదిరించడం