అమ్మాయి ప్రేమ పరిణయం 51
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 51 తినడం పూర్తయ్యేసరికి ఏదో నిర్ణయానికొచ్చినట్టు "సారీ సర్ నేను మీ ప్రపోజల్ కి ఒప్పుకోవట్లేదు." అంది నిదానంగా కూల్ డ్రింక్ తాగుతూ.
ఆమె సమాధానానికి ఆశ్చర్యపోవడం ఈ సారి యశ్వంత్ వంతయ్యింది. ఆమె ఈ ప్రపోజల్ కి ఒప్పుకోదని అతను ఎంత మాత్రం ఊహించలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఆమెకి ఈ జాబ్ ఎంత అవసరమో అయినా కూడా రిజైన్ చెయ్యడానికి ఒప్పుకుందంటే ఆమె ధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. కానీ ఆ భావాలు బయటకి కనపడనీయలేదు. ఆమె ఒప్పుకోకపోతే వాళ్ళ తాతయ్య తనని ఇంక ఎప్పటికీ నమ్మకపోవచ్చు, అంతే కాదు నేను మోసం చేస్తున్నానని కూడా అనుకోవచ్చు. అదే నిజమైతే నాతో ఇంకెప్పటికీ మాట్లాడకపోవచ్చు అసలు ఇంటికి వస్తారో రారో కూడా తెలీదు. తాతయ్య నా దగ్గర ఎంత కోపం చూపించినా ఈ విషయం బయటపడిందంటే నాకు తెలియకుండా ఆయన చాలా బాధపడతారు. తాతయ్యకి అలాంటి పరిస్థితి తీసుకొని రావడం అతనికి ఇష్టం లేదు. అలా జరగకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెని ఈ ప్రపోజల్ కి ఒప్పించడం తప్ప వేరే దారి లేదు. అందుకే కొంచం కటువుగా"
"ఓ...అయితే నీకు ఈ జాబ్ అవసరం లేదనమాట...ఇట్స్ ఓకే...నీ డెసిషన్ నీ ఇష్టం...ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యి" అన్నాడు రెసిగ్నేషన్ పేపర్స్ ముందుకి నెడుతూ. ముందు ఆవేశం లో నోరు జారినా పేపర్స్ సైన్ చెయ్యమంటే మళ్ళీ ఇంకో సారి ఆలోచిస్తుందని అతని ఆలోచన. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యకుండా ఉంటే బాగుండునని అతని మనసు