అమ్మాయి ప్రేమ పరిణయం 55
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 55 ఆ మాట వినగానే చెస్ సామాన్లు ఎక్కడివక్కడ సర్దేసి రఘుపతి గారు రూం లో దుప్పటి కప్పుకొని పడుకున్నారు. వెంకట్రామయ్యగారు హాల్ లో పేపర్ తీసుకొని చదువుతున్నట్టు కూర్చున్నారు. యశ్వంత్ రాగానే హాల్ లో ఉన్న వెంకట్రామయ్య గారిని పలకరించాడు. ఆయన యశ్వంత్ వైపు కోపంగా చూసి "మీ తాతయ్య లోపల ఉన్నారు" అన్నారు ఇంక వేరే మాటకి ఆస్కారం ఇవ్వకుండా. ఆయన అలా వెళ్ళిపోవడం యశ్వంత్ కి బాధ అనిపించినా రఘుపతి గారికి ఎలా ఉనొద అన్న కంగారు లో ఆ విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ తాతగారి రూం కి వెళ్ళాడు.
గది తలుపు తీసుకొని లోపలికి వచ్చి వాళ్ళ తాతగారి మంచం పక్కన కుర్చీలో కూర్చొని "తాతయ్య" అని పిలిచాడు
మొదటి సారి పిలిచినప్పుడు ఆయన నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఆయనకి వినబడలేదేమో అనుకొని మళ్ళీ పిలిచాడు "తాతయ్య" అని
రఘుపతి గారు కప్పుకున్న దుప్పటిని చిన్నగా తీస్తూ కళ్ళు తెరిచి "ఎవరు" అన్నట్టు చూసారు. అక్కడ యశ్వంత్ కనపడగానే కోపంగా "నువ్వా....నువ్వెందుకొచ్చావు.. అయినా నువ్విలా నా రూం లోకి వస్తుంతే ఆ వెంకట్ గాడు ఏం చేస్తున్నాడు. నేను నీతో మాట్లాడట్లేదని వాడికి తెలీదా అసలు వాడు నిన్ను లోపలికి ఎలా రానిచ్చాడు" అంటూ మంచం మీద నుండి దిగబోయారు
యశ్వంత్ వెంటనే లేచి ఆయన్ని పట్టుకొని "తాతయ్య ప్లీజ్ మీరు ఆవేశ పడకండి"
ఆయన యశ్వంత్ చేతిని విదిలిస్తూ "అసలు నువ్వు ఎందుకు వచ్చావు. నా గురించి నీకెందుకు. నిన్ను ఇప్పుడు ఎవరు రమ్మన్నారు. ఇన్ని రోజుల నుండి ప్రణవి ఇక్కడ లేదని