అమ్మాయి ప్రేమ పరిణయం 6
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 6 రఘుపతి గారు అసంతృప్తిగా చూశారు యశ్వంత్ వైపు. ఆయన చాలా ఫీలయ్యారని యశ్వంత్ కి అర్ధం అయ్యింది. రవళి కి కూడా అసంతృప్తిగానే ఉంది. ప్రణవి ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇన్ని రోజులు ఎదురుచూసింది. ఎందుకంటే ప్రణవిని వాళ్ళెవరూ ఇప్పటిదాకా చూడలేదు. రఘుపతి గారు కూడా ఆ అమ్మాయిని ఫొటో లో చూడడమే తప్ప ఎప్పుడూ డిరెక్ట్ గా చూడలేదు. తన కూతురిని కాదని ప్రణవి ని చేసుకున్నాడంటే ఆమె అంత అందగత్తె అని కూడా అనిపించింది. అందుకే యశ్వంత్ వస్తున్నాడంటే ప్రణవి కూడా వస్తోందనుకుంది. కాని అతనొక్కడే రావడంతో ఆమెకి చాలా నిరాశగా ఉంది. ఆ ఆలోచనలో ఉండి అలాగే నిలబడిపోయిన రవళితో "దిష్టి తియ్యమ్మా" అన్నారు నిరాశగా. రవళి దిష్టి తీయగానే యశ్వంత్ లోపలికి వెళ్ళాడు. యశ్వంత్ తో పాటు సంజయ్ కూడా లోపలికి వచ్చాడు. సంజయ్ కి ఎప్పుడెప్పుడు యశ్వంత్ ని వంటరిగా కలిసి మాట్లాడదామా