అశ్వహృదయం 1

By | October 11, 2024
telugu sex stories అశ్వహృదయం 1 1. పరిచయం “ఏందిరా పొద్దున్నే కొలిమి పెట్టినావు, అంత పని ఉంది ఏంటి?” అన్నాడు నాగన్న కొలిమి లోంచి నిప్పు తీసుకొని తన బీడీ వెలిగించు కొంటు. “అవును మామా , వర్షాలు పడ్డాయి కదా అందుకే దుక్కి దున్నడానికి మడకలు కావాలిగా ఈ చుట్టూ పక్కల ఉన్నది మన కొలిమి ఒకటే కదా అందుకే మామా కొద్దిగా పని ఎక్కువ అయ్యింది” అన్నాడు రంగడు చేతిలోని సుత్తితో కాలిన ఇనుమును కావలసిన విధంగా సాగ దీస్తూ. “ఒక్కడివే ఉన్నావు ఏంటి ? నా అల్లుడు ఎక్కడ , కాలజీ కి వెళ్ళాడా” “లేదు మామా రెండు రోజుల నుంచి పంపలేదు, పని ఉంది నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడే సమ్మెట కొడుతున్నాడు, అలసి పోయాడు , అందుకే కొద్దిసేపు పడుకోమని నేను లేప లేదు.” “కొడుకంటే వాడురా , మాకూ ఉన్నాడు ఎందుకు ఇంట్లో ఒక్క పని చేయరు , దానికి తోడూ దానికి డబ్బులు ఇవ్వు , దీనికి డబ్బులు ఇవ్వు అంటూ మా చేత కర్చు పెట్టిస్తు ఉంటారు, వీడు ఉన్నాడు నువ్వు కర్చుల కు ఇచ్చిన డబ్బులు కూడా మా చెల్లికి ఇస్తూ ఉంటాడు అంట” “ఏమో మామా వీడు అందరి లా కాకుండా వేరుగానే అనిపిస్తున్నాడు” “ఒరే రంగా అలాంటి కొడుకు ఉన్నందుకు గర్వ పడు బామర్ది, వాడికి ఎం కాదు , చూస్తూ ఉండు మంచి ఉద్వోగాలు సంపాదించి నిన్ను మా చెల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోంటాడు.” “ఏమో మామ పాపం ఆ వయస్సు పిల్లలు సంతోషం గా ఉంటె నేను వాడిని ఇక్కడ సమ్మెటతో నా పని చేయించు కొంటున్నాను.” “ఏంటి మామా , పొద్దున్నే మా నాయన మీద పడ్డావు?, ఎం నాయనా ఇంకా ఎంత పని ఉంది , ఈరోజు అయిపోతుందా రేపటి నుంచి నేను కాలేజీ కి వేల్లోచ్చా , నేను రెండు నిమిషాల్లో వస్తా మొహం కడుక్కొని నువ్వు కొలిమి వేడి చేసుకో” అంటూ తను లేచిన చాప , దిండు మడత పెట్టి అక్కడ ఉన్న అటక మీద పెట్టి బయట ఉన్న వేప చెట్టు దగ్గర కెళ్ళి దాన్ని నోట్లో వేసుకొని తోముకొని అక్కడ ఉన్న తొట్టి లోని నీటిని తీసుకొని మొహం కడుక్కొని తన బుజం మీద ఉన్న టవల్ తో తుడుచు కొంటు కొలిమి ఉన్న ప్లేస్ కి వచ్చాడు. ఉరి చివర ఉన్న ఓ పెద్ద వేప చెట్టు కింద ఉంటుంది కొలిమి, అది ఓ 500 గడపలు ఉన్న ఓ చిన్న పల్లె, ఆ వేప చేట్టుకొని అనుకోని ఉన్న ఓ చిన్న బోద కొట్టం లో ఉంటారు ఆ కొలిమి నడుపుతున్న ఓనర్ రంగా, అతని బార్య మంగి అతని కొడుకు శివ. “నాన్న ఇదిగో రాత్రి కలిపిన సద్దన్నం కొద్దిగా తిని ఆ తరువాత పని లోకి వెళ్ళు , నీకు మీ నాన్నకు ఓ సారి పనిలోకి దొరికితే ఆకలీ దప్పికా ఎం తెలీవు ” అంటు శివ వాళ్ళ అమ్మ ఓ ముంత తెచ్చి శివ చేతిలో పెట్టింది, ఇంకో చేతికి ఓ ఉల్లి పాయి , మిరప కాయ ఇస్తూ. “నాయన తిన్నాడా అమ్మా” “నువ్వు తింటూ ఉండు , మీ నాన్నకు కుడా తెత్తాండ” అంటూ ఇంట్లోకి వెళ్లి మరో ముంత తెచ్చి ఇచ్చింది రంగాకు. “ఆన్నా , ఇంకో ముంత ఉంది నీకు కుడా తెస్తున్నా ఉండు” అంది నాగన్న వైపు చూస్తూ “వద్దు తల్లీ , నేను పొద్దున్నే తిని వచ్చా ఇంట్లో” అన్నాడు నాగన్న. వాళ్ళ అమ్మ ఇచ్చిన ముంతను రెండు నిమిషాల్లో కంప్లీట్ చెసి , ముంతను ఇంతకూ ముందు తను మొహం కడుక్కొన్న తొట్టి దగ్గరుకు వెళ్లి కడిగి వాళ్ళ అమ్మకు ఇచ్చాడు. వాళ్ళ నాన్న తన ముంత లోని అన్నం తింటూ ఉండగా శివ కొలిమి దగ్గరకు వచ్చి అందులోని కొద్దిగా బొగ్గులు సరిగా వేసి , అక్కడ ఉన్న గాలి కొట్టే తిత్తిని కొద్ది వేగంగా కదుపుతూ కొలిమిలో ఉన్న ఇనుమును, పట్టకర్రతో తిప్పుతూ దాన్ని పూర్తిగా వేడెక్కించాడు. ఈలోపున వాళ్ళ నాన్న తన చేతిలోని ముంతను ఖాళీ చేతి కొడుకు చేతిలోని పట్టకర్ర తీరుకొని ఆ ఇనుము ను తన చేతిలోకి తీసుకొని , “నువ్వు సమ్మేట తీసుకో నాన్న” అంటూ వేడెక్కిన ఇనుమును అక్కడున్న ఇనుప దిమ్మి మీద పెడుతూ దాన్ని అటు ఇటు తిప్పుతూ తన చేతిలోని చిన్న సుత్తితో కొడుతూ దానిని తనకు కావలసిన రీతిగా మలుచు కో సాగాడు. ఈ లోపున తన బుజం మీద ఉన్న టవల్ ని తలకి చుట్టుకొని , అక్కడున్న సమ్మెట తీసుకొని రంగా పెట్టిన ఇనుము మీద రిథమిక్ గా దెబ్బలు వెయ సాగాడు, అంతకు ముందు తన వంటి మీద ఉన్న టవల్ ఇపుడు తన తల మీదకు వెళ్ళడం వల్ల తన బనియన్ లోంచి ఉబికి బయటకు వస్తున్న కండలు , సమ్మెట కొడుతూ ఉన్నప్పుడల్లా శివా భుజాలు , అతని కండలు చూసి , “రంగా, అల్లుడు పెద్దోడు అవుతున్నాడు” అన్నాడు ఇంకో బీడీ వెలిగిస్తూ. “ఇంటర్ రెండో సంవత్సరానికి పెద్దోడు ఎలా అవుతాడులే , వాడు అంతా మా నాయన శివన్న పోలిక , మా నాయన పొయే నాటికి కుడా , చాల ఆరోగ్యంగా ఉండేవాడు. ఆయన ఆరడుగుల పైన ఉండే వాడు. వీడికే అదే పోలిక వచ్చింది, అందుకే అయన పేరు పెట్టుకొన్నా ” అన్నాడు సమ్మెటతో పలుగు గా తయారు అవుతున్న ఇనుము కమ్మీ మీద వెట్లు వేస్తున్న కొడుకును మురిపంగా చూస్తూ. “వీడు కూడా , మీ నాన్న లాగా బాగా చదువుకుంటాడులే” “మా నాయన ఎక్కువ చదువుకోలేదులె , ఆ కాలంతో SSLC చదువుకొన్నాడు , సర్కారోల్లు ఉద్యోగం ఇచ్చినా వద్దు అని కోలిం పనే చేసేవాడు, అప్పట్లో నో ఏవో కొత్త కోత్త పరికరాలు తయారు చేసేవాడు వ్యవసాయానికి అవసరం అయ్యేట్లు, వీన్ని ఈ పనిలోకి రావద్దు అంటున్న , టౌన్ కి వెళ్లి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి , ఈ గొడ్డు చాకిరీ నా తోనే ముగిసిపోవాలి” అన్నాడు. “ఏందిరా రంగా , మొన్న తోనిక్కట్టెలు చేయమని ఇచ్చాను , చేసినావా” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజా రెడ్డి. “రాత్రే అయ్యింది మామా పొద్దున్నే నేనే వచ్చి ఇద్దాము అనుకొన్నా , కాకా పొతే కొద్దిగా పని ఎక్కువ ఉంది, అదిగో ఆ గుంటక పక్కన పెట్టినా చూడు తీసుకో” అన్నాడు తన ద్యాస కొడుకు కొట్టే సమ్మెట మీద నుంచి మార్చ కుండా, ఆ సమ్మేటకు అనుగుణంగా పట్టకారుతో ఆ ఇనుప కమ్మీని తిప్పుతూ. చేతిలోని తోనిక్కట్టెలు తీసుకొని వాటిని ఓ మారు చెక్ చేసి “చుసినావురా నాగ్గా , ఈ తోనిక్కట్టేలతో చెండ్లో గడ్డి కాకుండా ఎవరినన్నా ఎసేయాలన్నా ఒక్క దెబ్బ చాలురా , ఒరే మా నాయన చెప్పేటోడు , ఇనుమ్మీద మీ నాయన చెయ్యి పడితే, గుడిలో వరాలిచ్చే దేవత లాగా అయన మాట ఇని , ఆయనకు కావలసినట్లు తయారు అయ్యేవంట పనిముట్లు, మీ నాయన చేసిన బలి కత్తి ఇప్పటికీ మా ఇంట్లో అటక మీద ఉంది, నువ్వు మీ నాయనకు ఎ మాత్రం తీసుపోవురా, ఏంటి నీ కొడుకును నీ లాగే తయారు చేత్తున్నావా ఎంది , మొన్న మా యమ్మి చదివే కాలేజీ లో చూసినా వీన్ని , కాలేజీ కి పోలేదా ఎంది” అన్నాడు. “పని ఎక్కువగా ఉంది అని , నేనే పంపలేదు మామ , రేపట్నుంచి పోతాడులే” “సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకొని పో” “తీసుకొంటాలె , నీ దగ్గర ఎక్కడ పోతాయి డబ్బులు” “వీనికి పని చేసేది వచ్చు డబ్బులు ఎలా అడగాలో కూడా తెలీదు , మొన్నటి సారి బండికి ఇరుసు పొతే ఎసిచ్చినావు దాని డబ్బులు కూడా తీసుకోలా , ఒరే అబ్బీ నువ్వన్నా వచ్చి తీసుకొని పో అవ్వీ ఇవ్వీ అన్నీ కలిపి” . “అలాగే మామా” అన్న శివా వైపు చూస్తూ తోనిక్కట్టెలు తీసుకొని వెళ్ళాడు రాజా రెడ్డి. వీళ్ళు పని చేసుకొంటూ ఉండగా, ఇంకో ఆరేడు మంది వచ్చారు , తమ పనిముట్లు తీసుకొని వాటిని మెరుగు పెట్టాలి అంటూ. ఓపక్క పని చేస్తూనే వాళ్ళు ఇచ్చిన పనిముట్లు తీసుకొని వాళ్ళకు ఎప్పుడు వచ్చి తీసుకొని పోవాలో చెపుతూ వాళ్ళను పంపిచ్చాడు రంగాన్న. చూస్తూ ఉండగా తన చేతిలోని ఇనుపు ముక్క తను అనుకొన్న రూపానికి రాగా త్రుపిగా దాని వైపు చూసి , కొలిమి లో ఉన్న ఇంకో ఇనుప ముక్కను తీసుకొని దాని రూపు రేకలు మార్చ దానికి పూనుకొన్నాడు. రుద్రాపురం , రాయల సీమలో ఓ మారు మూల పల్లె , ఆ పల్లెకు పక్కనే ఓ పెద్ద అడివి , ఆ పల్లెకు ఓ రెండు కిలో మీటర్ల దూరం లో రైల్వే స్టేషన్ , ఓ 20 కిమీ దూరంలో ఓ తాలుకా హెడ్ క్వార్టర్. జిల్లాకు ఓ 150 కిమీ దూరంలో ఉంటుంది. ఊర్లో హైస్చూల్ వరకు ఉంది , కానీ కాలేజీ కి వెళ్ళాలి అంటే పక్కన ఉన్న టౌన్ కు వెళ్ళాల్సిందే. ఆ ఊర్లో పొలాలు మంచి సారవంతమైనవి , పక్కనే అడివి ఉండడం వళ్ళ చిన్న చిన్న కుటుంబాలకు గొర్రెలు , మేకలు మేపుకొని ఉపాది పొందే వారు. పక్కనే రైల్వే స్టేషన్ ఉండడం వళ్ళ కొండలో ఎండిన కట్టెలు తెచ్చి టౌన్ లో అమ్ముకోవడం కుడా ఒకప్పుడు ఉపాదిగా ఉండేది , కానీ ఆ అడివి ఫారెస్ట్ వాళ్ళ చేతికి వచ్చాక ఫారెస్ట్ వాళ్ళు కట్టెలు కొట్టే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు ఇంకో సారి ఎవరన్నా కట్టెలు కొట్టేది కనపడితే , స్టేషన్ లో వేస్తాము అని అప్పటి నుంచి ఎవ్వరు ఆ పని మాత్రం చేయలేదు. ఆ కొండ లోపల ఓ శివుని గుడి ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టపడాలి , కానీ శివరాత్రి రోజు ఆ గుళ్ళో పూజలు బాగా జరుగుతాయి. ఊర్లో నడవ గలిగిన వాళ్ళు అంతా అక్కడే ఉంటారు , కొద్ది దూరం ఎద్దుల బండ్లు వెళతాయి కానీ ఆ తరువాత నడవాల్సిందే. ఆ కొండలో ఎలుగు బంట్లు , అడివి పందులు ఎక్కువ అందుకే ఒంటరిగా ఎవ్వరూ అడివి లోకి వెళ్లరు సాదారణంగా. ఆ అడివికి ఉరికి మద్యలో ఓ చిన్న చెరువు , అడివిలోని వర్షపు నీళ్ళు అన్నీ అక్కడ చెరువులో నిలువ అవుతాయి , జిల్లాలో అన్ని చెరువులు ఎండి పోయినా ఇది మాత్రం ఎప్పుడు నిండి ఉంటుంది. కొండ లోంచి వచ్చే ఉట నీళ్ళే దానికి కారణం. “పయటాల అయ్యింది , ఆపేసి వచ్చి అన్నం తినండి బిడ్డని పొద్దున్నుంచి సంపెత్తున్నావు” అంది రంగడి బార్య. ఈ లోపున “ఒరే శివా , చేర్లోకి ఈతకు వెళుతున్నాము వత్తావా” అంటూ ఓ 5 మంది శివా వయసున్న పిల్లలు వచ్చారు కొలిమి దగ్గరికి. “వెళ్లి తొందరగా రా నాన్న , నేను తిని రోంచేపు నడుం వాలుస్తా , పెద్దగా పని ఎం లేదులే , రెండు గుంటకలు మిగిలి పోయినాయి , నువ్వు వచ్చాక చేసుకోవచ్చులే” అంటూ కొలిమి అపేసి భార్యతో ఇంటికి వెళ్ళాడు. శివా తన ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్ళాడు. రంగడు కొద్దిగా చామన చాయగా ఉంటాడు , కానీ శివ అమ్మ తెల్లగా పాల మీగడ లోంచి అద్ది తీసినట్లు గా ఉంటుంది. రంగడు వయస్సులో ఉన్నప్పుడు , పక్కనే ఉన్న తాండాలో ఏవో పనిముట్లు ఇవ్వడానికి వెళ్లి , అక్కడ మంగతో లవ్ పడి ఊర్లో వాళ్ళను ఎదిరించి ఆమెను ఎత్తుకొని వచ్చాడు, అప్పడు శివా తాత , నా బిడ్డ మీద చెయ్యి పడితే ఉరు నంతా స్మశానం చేస్తానని పలుగు పట్టుకొని అడ్డ పడ్డాడు, శివా తాత అంటే అప్పట్లో కొద్దిగా భయం ఆ చుట్టుపక్కల అందరికీ , ఆయన్ని చూసి రంగన్ని వదిలేసారు. శివ అమ్మ తెలుపే శివాకి వచ్చింది. 6.1 తో ఆ తెలుపుతూ, కస్టపడి పెంచిన బాడీతో ఫ్రెండ్స్ తో వెళుతూ ఉంటె, వాళ్ళే వేడిని ఏడిపించే వాళ్ళు “పిండి రాయి , పిండి రాయి” అని. ఇప్పుడంటే రక రకాల paints వచ్చాయి కానీ పూర్వం గోడలకు సున్నం పుసేవాళ్ళు , ఆ సున్నం ఓ రకమైన రాతి లోంచి వచ్చేది. ఆ రాతిని బట్టీల్లో పెట్టి రెండు మూడు రోజులీ వేడి చేసేవాళ్ళు ఆ తరువాత అదే రాయి సున్నం లాగా తాయారు అవుతుంది. చూడ దానికి గట్టిగా అగుపిస్తుంది , కానీ పట్టుకోగానే పొడి పొడి అయ్యి మన్ను లాగా విడిపోతుంది. శివ కుడా అంతే చూడ్డానికి పెద్ద పైల్మాన్ లాగా ఉంటాడు కానీ వాడితో మాట్లాడితే తెలుస్తుంది వాడు ఎలాంటి వాడో. తన ఫ్రెండ్స్ మొత్తం 5 గురు శివా తో కలిపి , అందులో ఇద్దరు మాత్రం ఇప్పుడు తన క్లాసు లో చదువుతూ ఉన్నారు , మిగిలిన ఇద్దరు 10 తరగతి ఫెయిల్ అయ్యి ఇంటి పనులు చూసుకోంటు ఉన్నారు. తనతో చదివే వాళ్ళు అది, చంద్రా ఫెయిల్

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *