Ciceelean Adventure by Madhubabu
సిసిలో దేశపు సైనికాధికారి మేజర్ సఫారీ. అతను ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని, వివిధ దేశాలను తన చెప్పుచేతలలో ఉంచుకోవాలని కలలు కంటూంటాడు.
సైంటిస్ట్ అయిన డాక్టర్ కెల్లీతో చేతులు కలిపి, ప్రాణాంతక రసాయనాలతో స్కెలిటన్ టాబ్లెట్లని తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తూంటాడు. రోడ్ల మీద ఒంటరిగా వెళ్ళే బాటసారులను, వాహనదారులను కిడ్నాప్ చేసి ఈ టాబ్లెట్‌ని వారిపై ప్రయోగిస్తూంటారు. ఆ టాబ్లెట్స్‌ని సేవించిన వారు ముందుగా ఫిట్స్ వచ్చినట్టుగా గిలగిలా కొట్టుకుంటారు. అరగంట తర్వాత వారి శరీరంలో కదలికలు ఆగిపోతాయి. శరీరం దుర్వాసన వేస్తుంది. మరి కాసేపటికి శరీరంలో మాంసం, రక్తం, నరాలు అన్నీ మాయమై శవం ఎముకల గూడులా మారుతుంది.
ఈ గాంగ్‌ని పట్టుకోవడానికి సిసిలీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు కొరగాకుండా పోయాయి. దాంతో వాళ్ళు ఇంటర్‌పోల్ సాయం కోరుతారు. ఇంటర్‌పోల్ తరపున శ్రీకర్, ముఖేష్, షాడోలు ఈ అసైన్‌మెంట్‌లో పాలుపంచుకుంటారు.
ముందుగా శ్రీకర్, ముకేష్ వచ్చి ఈ గాంగ్ స్థావరం ఎక్కడో కనుక్కుంటారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు దొరికిపోయి, గ్యాంగ్ చేతిలో చిత్రహింసలకి గురవుతారు. షాడో అంకోనాలో అడుగుపెడుతూనే, అతన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తారు ప్రత్యర్థులు. అతని హోటల్ రూంలో బాంబు పేలుడు సంభవిస్తుంది. షాడో అంకోనాని వదిలి, బ్రిండిసి పట్టణానికి వస్తాడు. అతను అక్కడ విమానం ఎక్కి, మెస్సినీ వెళ్లాలని అతడి ఆలోచన. అయితే ఉన్నట్లుండి స్థానిక విమానాశ్రయంలో పేలుడు సంభవించి రాకపోకలు రద్దవుతాయి. ఓ ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకుని బయల్దేరుతాడు షాడో. కొద్ది సేపట్లోనే ఆ విమానం దారి మళ్ళుతుంది. ఉన్నట్లుండి సముద్రంలో కూలిపోతుంది.
షాడో ఎలా తప్పించుకున్నాడు? ఈ ప్రమాదాల వెనుక ఉన్నది ఎవరు? శ్రీకర్, ముఖేష్, స్కెలిటన్ టాబ్లెట్ ప్రభావం నుంచి ఎలా తప్పించుకున్నారు? షాడోకి సాయం చేసిన ఈ సిసిలియన్ సుందరి ఎవరు? డాక్టర్ కెల్లీ, మేజర్ సఫారీలు చట్టానికి చిక్కారా?
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కావాలంటే ఈ థ్రిల్లర్ చదవాల్సిందే
పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి