కాస్ట్లీ రొమాన్స్ 1
telugu stories kathalu novels కాస్ట్లీ రొమాన్స్ 1 కారు రయ్యిన దూసుకు వచ్చి పోర్టికోలో ఆగింది. డ్రైవర్ దిగి వెనక డోర్ తెరచి వినయంగా నిలుచున్నాడు. అందులో నుండి… బిడియంగా దిగింది శ్రీలక్ష్మి. తన చేతిలో వున్న బ్యాగ్ ని గుండెలకి హత్తుకుని ఎదురుగా ఉన్న ఆ ఖరీదైన బంగళాని నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయింది. ఆమెకిదంతా కొత్తగా ఉంది. మొట్ట మొదటిసారి కారు ఎక్కింది.
ఇప్పుడు మొట్టమొదటి సారిగా రాజభవనం లాంటి ఆ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చింది. ఆమె ఆశ్చర్యంగా కళ్ళను ఇంత చేసి చుట్టూ చూడడం గమనించిన ఆ ఇంటి తాలూకు వ్యవహారాలని చూసుకునే మూర్తి చిన్నగా నవ్వుకున్నాడు.
ఆమె దగ్గరకు వచ్చి…”నువ్వేనా అమ్మా శ్రీ లక్ష్మి అంటే…” అనడిగాడు…
శ్రీలక్ష్మి అతని వైపు బిడియంగా చూస్తూ అవును అన్నట్లు తలూపింది
అతను నవ్వుతూ. ‘లోపలికి పదమ్మా… చిన్నమ్మగారు మీరోస్తారని చెప్పారు. మీకు అతిథి మర్యాదలు చేయమన్నారు…” అంటూ లోపలి నడిచాడు అతను.
అతని వెనకాలే శ్రీలక్ష్మి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయినట్లు అయింది ఆమెకి… ఆ ఇంటి వైభవాన్ని చూసి…. సినిమాల్లోని ఖరీదైన భవంతులలాగా మెరిసిపోతూంది ఆ ఇల్లు… అన్నీ ఖరీదైన వస్తువులే ఉన్నాయి ఆ ఇంటి నిండా…. విశాలమైన హాలు మధ్యలో రౌండ్ గా వేసి ఖరీదైన సోఫాసెట్లు వాటి మధ్యలో గ్లాస్ తో చేయించిన టీపాయ్ ఉన్నాయి.
నేలపైన ఖరీదు రంగు రంగుల తివాచీ పరచబడి ఉంది. నడుస్తూ వుంటే ఎంతో మెత్తగా అది తగులుతుంది. చుట్టూ గోడలకి పెద్ద పెద్ద ఫ్రేములతో కూడిన అందమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ హాలు మధ్యలో నుండి పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. ఆ ఇల్లు నిజంగా సినిమాలో వేసిన సెట్టులాగే ఉంది. కానీ ఇది సినిమా కాదు. నిజమే. సినిమాలో తప్పితే ఇలాంటి ఖరీదైన భవంతులు నిజంగా వుంటాయా, అనుకున్న ఆమె అనుమానానికి తెర