కాస్ట్లీ రొమాన్స్ 3
telugu stories kathalu novels కాస్ట్లీ రొమాన్స్ 3 వాణి అలా అనేసరికి శ్రీలక్ష్మి ఒక్కసారిగా ఆమెని కౌగిలించుకుంది…. ఆమెకి ఒక్కసారిగా దు:ఖం ముంచుకు వచ్చింది…. స్నేహితురాల్లిద్దరూ గుండెల్లో దాగి ఉన్న బాధనంతా కన్నీళ్ళ రూపంలో బయటికి పోనిచ్చిన తర్వాత తేలిక పడ్డ మనసులతో మళ్ళీ ఉత్సాహంగా మారిపోయారు. శ్రీలక్ష్మి వెంటనే తన చిన్ననాటి స్మృతులలోకి వెళ్ళిపోయింది… వాణి కూడా గతం జ్ఞాపకాలని నెమరు వేసుకుంది…
ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఆ క్షణంలో వాళ్ళిదరూ చిన్నపిల్లలే అయిపోయారు… వారి కళ్ళలో ఎంతో సంతోషం. ఇక మళ్ళీ కలువలేకపోతామేమో అనుకున్న వాళ్ళిద్దరూ ఒకటిగా చేరేసరికి వారిలోని ఆనందం ఒక్కసారిగా వెల్లి విరిసింది.
”అది సరేగానీ వాణీ… ఏమిటే ఒక్కసారిగా ఇంత షాక్ ఇచ్చావు నాకు… నేను చూస్తున్నదంతా నిజమేనా…?” ఆతృతగా అంది శ్రీలక్ష్మి.
ఆ మాటలకి చిన్నగా నవ్వింది వాణి. నేను కాలేజీ చేసేటప్పుడు ఆయన నన్ను చూసారట. నా అందానికి ముగ్ధుడై పోయి వెంటనే నాన్నని కలిసి నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. కోట్ల రూపాయల ఆస్ధి… బంగారం లాంటి సంబంధం… అదృష్టం వెతుక్కుంటూ వచ్చి కూతురుని కౌగిలించు కుంటూటే ఏ తండ్రి మాత్రం కాదంటాడు. అందుకే ఆయన అలా అడగడమే ఆలస్యం… నాన్నగారు వెంటనే మా పెళ్ళికి ఒప్పేసుకున్నాడు….”
శ్రీలక్ష్మి ఎంతో సంతోషించింది. ‘అబ్బ… అదృష్టం అంటే నీదేనే… ఇంత పెద్ద ప్యాలెస్ లో నిజంగా నువ్వు మహారాణిలా ఉంటున్నావు… నిన్ను చూస్తుంటే… నాకెంతో గర్వంగా ఉంది. నా స్నేహితురాలు ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నందుకు ఎంతో ఆనందంగా కూడా ఉంది. నువ్వు ఏది కావాలనుకున్నా నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తాయి… నీ జీవితం అంతా స్వర్గసుఖాలతో