ధర్మేచ అర్థేచ..2
telugu stories kathalu novels ధర్మేచ అర్థేచ..2 "ఓకె. సీ యూ.." అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడతను. ఎవరే అంది వాణి. జరిగిందంతా చెప్పాను.షాపింగ్ చూసుకుని, అందరం చందనబ్రదర్స్లోంచి బయటికి వచ్చేసరికి మళ్ళీ అతనిఫోన్. 'లెనిన్ స్టాట్యూ దగ్గర ఉన్నా'నంటూ. 'టూ మినిట్స్‌లో వస్తున్నా'నని చెప్పి పెట్టేశాను. దూరంగా కనిపిస్తున్న లెనిన్ బొమ్మముందు ఫోన్లోకి చూసుకుంటూ ఒకతను నిలబడ్డాడు. అతన్ని పరిశీలనగా చూసి, 'ఎస్ అతనే..' అనుకున్నాను. మేం వెనకనుంచి వెళ్ళేసరికి అతనేదో ఫోన్ అటెండయి ఉన్నాడు.
"వై కాన్ట్ యు అండర్‌స్టాండ్ మామ్..? హిమది బ్యాడ్ క్యారెక్టర్ అని ఇంత ప్రోపగాండా అయ్యాకకూడా నన్నెలా చేసుకోమంటావ్..? చేసుకుంటే నా ఫ్రెండ్సందరికీ నేనెలా కనిపిస్తాను..? .. .. హిమ మంచిదే. బట్ మ్యారేజ్ చేసుకునేది పీస్ఫుల్ లైఫ్‌కోసం మామ్. ఆ న్యూసెన్స్‌కి నేను మెయిన్‌పాయింట్ అవలేను .. .. ఎందుకవను..? గ్రేట్ అంటారు నాతో. నా వెనక..? .. .. వాళ్ళిద్దరి మధ్యా ఏం లేకపోయినా వాడిలో ఉందిగా. అది తెలిసీ వాడితో వెళ్ళడం తప్పుకాదా..? ఎవరో అమ్మాయికోసం నన్ను కన్విన్స్ చేస్తావేంటి..? .. .. వెళ్ళిపోవట్లేదు. వస్తాను. బట్ వెన్ యు లీవ్ దట్ మ్యాటర్. ఓకె. వస్తాలే బై.." కాల్ కట్ చేసి, చుట్టూ చూస్తూ వెనక్కు తిరిగాడతను. అక్కడేఉన్న మమ్మల్ని చూసి తడబడుతూ నవ్వాడు. ఏం మాట్లాడాలో తెలీనట్టు "హ్యాపీ పొంగల్.." అన్నాడు. బదుల్ విష్ చెప్పాక, చేతిలోని బుక్‌ని ఇస్తూ, "ఐ యాం మాధవ్. కొండాపూర్‌లోని ఆదిత్యబిర్లా గ్రూప్, మినాక్స్లో టీం లీడర్‌గా చేస్తున్నాను. మీరు ఎక్కడుంటారు..?" అడిగాడు.
"సికింద్రాబాద్‌లో.." ముభావంగా చెప్పాను. 'ఒక అమ్మాయిమీద