హ్యాపీ జర్నీ 2
telugu stories kathalu novels హ్యాపీ జర్నీ 2 ఆమె మాటలకి అతనిలో వున్న అహం కూడా నిద్రలేవటంతో ఎలాగైనా ఆమెని ఎక్కడ చూశానో గుర్తు తెచ్చుకోవాలని నిర్ణయించుకుని గట్టిగా కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచించటం ప్రారంభించాడు. అతని చర్యలకి లోలోపలే నవ్వుకుంది ఆమె. ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళి ఆ మధ్యకాలంలో ఆమె ఎక్కడ కనిపించిందా అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు శ్రీధర్. ఊహూ ... ఆమెని తాను ఎక్కడ చూశాడో అస్సలు గుర్తురాలేదు. దానితో మెల్లిగా కళ్ళు తెరిచి నీరసంగా ఆమె వైపు చూశాడు.
‘’ఏమిటీ గుర్తు తెచ్చుకున్నారా’’ ఆతృతగా అడిగింది ఆమె.
శ్రీధర్ నీరసంగా గుర్తు రాలేదన్నట్టుగా తలాడించాడు. ఆమె కిలకిలా నవ్వింది. కాసేపు అలా నవ్వి తర్వాత అంది ‘’సరే మీకో క్లూ ఇస్తాను ఆ క్లూ ఆధారంగా నన్ను మీరు ఎక్కడ చూశారో గుర్తు తెచ్చుకోకపోతే మతిమరుపు వారందరికీ మీరే లీడర్ అని డిసైడయిపోతాను’’ అంది అతని వేపు అల్లరిగా చూస్తూ.
శ్రీధర్ ఉత్సాహంగా ‘’ఆ క్లూ ఇస్తారా? ఇవ్వండి ఆ క్లూ తో మిమ్మల్ని ఎక్కడ చూశానో ఇట్టే కనిపెట్టేస్తాను’’ అన్నాడు కాస్త ముందుకి వంగి ఆమె వేపు ఆతృతగా చూస్తూ.
ఆమె కాసేపు ఏదో ఆలోచించినట్టు మొహం పెట్టి తర్వాత అంది ‘’అయితే శ్రద్ధగా వినండి’’ అంటూ గొంతు సవరించుకుంది ఆమె. ‘’సరిగ్గా సంవత్సరం కిందట ఇదే తేదీలోకి వెళ్ళండి’’ అంది అతని వేపు సూటిగా చూస్తూ.
శ్రీధర్ ఒకసారి ఆలోచనగా పైకి చూసి తర్వాత ‘’ఆ ... ఆ .. .వెళ్ళాను ... కానీ సరిగ్గా ఈ తేదీలో నేనెక్కడవున్నానో కరెక్ట్ గా గుర్తు రావటం లేదండీ’’ అన్నాడు.
ఆమె శ్రీధర్ ని నవ్వుతూ చూస్తూ ‘’రానవసరం లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా