ఇదీ కధ 13
telugu stories ఇదీ కధ 13 అంటే అక్కడికి నువ్వు సూర్యుడి వైనట్టు! అవునా" మాధవి పెదవులపై దరహాసం మెరిసింది. అలా నిలబడ్డ మాధవిని చూస్తూ సాగర్ బయటి ప్రపంచాన్నే మరచిపోయాడు. గ్రహణం విడిచిన పూర్ణ చంద్ర బింబంలా ఉన్న మాధవి వదనాన్ని జీవితాంతం అలాగే చూడగలిగే అదృష్టం మళ్ళీ తనకు కలిగింది. మాధవి ఇంత త్వరలో మాములు మనిషి అవుతుందని తను ఊహించ లేదు. చెదరి పోయిన ఆమె మనస్సు కుదుట పడింది. మానసిక సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడింది. ఈనాటి ఆమె ప్రవర్తన తనకు పూర్తీ నమ్మకాన్ని కలిగించింది. ఆమె అంతరంతరాల్లోని అస్తవ్యస్థ పరిస్థితి పూర్తిగా తొలగిపోయింది.
"సాగర్! ఏమిటలా పిచ్చివాడిలా చూస్తున్నావ్?" మాధవి సాగర్ భుజాలు పట్టుకొని కుదిపింది.
సాగర్ ఉలిక్కిపడ్డాడు.
"పిచ్చివాడికి, మంచివాడికి నిజంగా పెద్ద తేడా లేదు."
'అయితే నీకు నిజంగా మతి పోయిందనే చెప్పాలి!' మాధవి గలగలా నవ్వింది. ఆమె నవ్వులో సెలయేటి పరుగులు, కోయిల పిలుపులు స్పురించాయి. సాగర్ మనసు నిండా వెన్నెల నిండుకొన్నది.
"మాధవీ! నాన్నగారికి చెప్పు రేపు సాయంకాలం ఆరు గంటలకు వస్తానని"
"ఏం? ఆరు గంటలకు గాని ముహూర్తం కుదరదా? నీకు జాతకాల మీకా ముహూర్తాల మీద నమ్మకం లేధంటావుగా?"
"ముహూర్తాల మీద నమ్మకం ఉండి కాదు. మీ నాన్నగారు ఉదయం పూట కోర్టుకెళ్ళే హడావుడిలో ఉంటారు కదా అని!"
"రేపు ఆదివారం! నువ్వేప్పుడోచ్చినా నాన్నగారు ఇంటి దగ్గరే వుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్టుకు వచ్చేయ్!"
"ఏం రాత్రికి డిన్నర్ లేదంటావా?"
"బ్రేక్ ఫాస్టు, లంచ్, డిన్నర్ అన్ని ఆరగించి మరీ వెళు దువు గాని వచ్చేయ్!"
"ఓ.కే. మిస్. యువర్ అనర్!"
"రేపు జడ్జి గారి ముందు ఎలా మాట్లాడాలో ఇప్పటి నుంచే రిహార్సల్స్ చేస్తున్నావా?"
"యస్ యువరానర్! ,మై హార్ట్ బ్లీడ్స్ ఫర్ డాటర్ . మే ఐ హావ్ ది హాండ్--"
"ఏయ్! ఏమిటిది? సరిగ్గా తెలుగులో చెప్పు, కోర్టుదిక్కార నేరం క్రింద శిక్ష పడుతుంది. మా నాన్నగారి దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవంటే తెలుసా?"
సాగర్ కారు స్టార్టు చేశాడు. సాగిపోతున్న కారు కేసి కొద్ది క్షణాలు అలాగే చూస్తూ పోర్టికోలో నిలబడింది మాధవి.
"నా నిర్ణయం చెప్పాను . తర్వాత