కామాంధుడి కిరాతకాలు 18
talugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 18 "ఏంటీ మాట్లాడవ్. నా వయసిప్పుడు తొంభైయొక్క సంవత్సరాలు. పదేళ్ళ క్రితం నా వైఫ్ ఎక్స్పైర్ అయినప్పట్నుంచీ ఇప్పటివరకూ ఏ రోజూ ఇంత ఎక్కువగా, జోష్‌గా మాట్లాడలేదు నేను. కానీ నిన్ను చూసిన తర్వాత నాకు తెలీకుండానే ఎంతో యాక్టివ్ అయ్యాను. ఎప్పుడూ లేని ఉత్సాహం వచ్చింది. నాలో నిన్ను ఆట పట్టించాలనీ, నీతో జోక్ చెయ్యాలనీ, నీతో మాట్లాడుతూ ఉండాలనీ, ఇంకా ఏదేదో అనిపిస్తోంది. ఇదంతా నా ఇన్నర్ ఫీలింగ్.." అని చెబుతుంటే, ఆయన గొంతు ఏ మాత్రం వణక్కుండా చాలా స్టిఫ్‌గా ఉంది.రెప్పవేయడం కూడా మరిచిపోయి, అయోమయంగా ఉండిపోయింది మనీష."నువ్వు చెబుతున్న వ్యక్తిలోనే కాదు మనీష.. సృష్టిలోని ప్రతీ ప్రాణికీ ఒక సెపరేట్ ఐ పవర్, దాని నుంచి పాజిటివ్ నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది నీలోనూ ఉంది. నాలో కూడా ఉంటుంది. దాని వల్లే ఎదుటి ప్రాణితో మనం ఏమీ మాట్లాడకుండా కూడా కళ్ళతోనే కమ్యూనికేట్ చెయ్యగలుగుతాం.." ఇప్పుడాయన గొంతు సీరియస్‌గా మారింది."మనం అన్ని జీవుల కంటే బాగా డెవలప్ అయ్యాం. ప్రతీ ఎమోషన్‌నీ మాటల్లో పెట్టగల లాంగ్వేజ్‌ని నేర్చుకున్నాం. అప్పటి నుంచీ కళ్ళనీ, వాటికున్న గొప్ప శక్తినీ పట్టించుకోవడం మానేశాం. కళ్ళతో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదిప్పుడు. అందుకే కళ్ళని మాత్రమే చూసి