మల్లెతీగ 2
telugu stories kathalu novels మల్లెతీగ 2 హాస్పిటల్ కి వెళితే తగ్గే జబ్బు కాదనీ, నా జబ్బు తగ్గే మందు ఆ ‘మల్లెతీగ’నే అని నా భార్యకి తెలియకపోవడంతో చాలా కంగారుపడుతోంది. స్వప్న చిన్నగా నవ్వి నా భార్యని సుతారంగా వారించింది. ”అంత కంగారు పడవలసిన అవసరం లేదక్కా… బావగారికి ఏం చేస్తే జబ్బు నయం అవుతుందో నాకు బాగా తెలుసు… నువ్వేం కంగారు పడకు…” తేలికగా అంది స్వప్న. ఉలిక్కిపడ్డాను నేను. నా ఆలోచనలని పసిగట్టినట్లు అంటున్న ఆమె మాటలకి కాస్త కంగారు పడిపోయాను.
నా చూపులలోని భావాన్ని తెలుసుకుందేమో అన్న అనుమానం కూడా కలిగింది నాకు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు తను నాకు ఏం ట్రీట్ మెంట్ ఇవ్వబోతోంది. ఇన్ని రోజులుగా నేను తనని అబ్జర్వ్ చేస్తున్నట్లు, తను కూడా నన్ను అబ్జర్వ్ చేసిందా ఏమిటి? ఏది ఏమైనా ‘మల్లెతీగ’ని, ఆమె మాటలని ఇంత దగ్గరనుండి గమనించే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో సంతోషం వేసింది నాకు. హుషారుగా బెడ్ పై నుండి లేచి కూర్చున్నాను. నాలో ఒక విధమైన ఉత్సాహం కలగటం గమనించి నా భార్య ఎంతో ఆశ్చర్యపోయింది.
దాన్ని పట్టించుకోకుండా… ”కూర్చోస్వప్నా… సంధ్యా వెళ్ళి మా ఇద్దరికీ కాఫీ తీసుకురా…” అన్నాను కాస్త ఉత్సాహంగానే….
”అలాగే” అంటూ నా భార్య వెళ్ళిపోయింది. స్వప్న నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాకు ఆమెతో ఏం మాట్లాడాలో తెలియలేదు. వరసకి మరదలే అయినా ఎప్పుడూ ఆమెతో మాట్లాడిన దాఖలాలు