మనసున మనసై 5
మనసున మనసై 5 'డోంట్ బీ స్టుపిడ్' మొహం ఎర్రబడగా అంది జయంతి.ఉషారాణి సరదాగా అన్న మాటలు జయంతి మనసులో ఆశల బీజం నాటినట్లయింది. తను కోరుకున్నవి అతనిలో ఉన్నాయి. తను మనసులో చిత్రించుకున్న అస్పష్ట రూపానికి ఓ రూపు వచ్చింది దివాకర్ రూపంలో
మరో రెండు రోజుల తర్వాత ఉషారాణి పెళ్ళి రోజున లంచ్ టైములో దివాకర్ జయంతిని రూములోకి పిలిచి మీరివాళ సాయంత్రం మీ స్నేహితురాలి పెళ్ళికి వెళ్తున్నారా...' అనడిగాడు. జయంతి చప్పున తల ఆడించి 'అఫ్ కోర్స్' అంది. అతను ఉషారాణి ఇన్విటేషన్ చూస్తూ 'ఈ పెళ్ళి కొడుకు నాకు తెలిసిన మా చిన్నప్పటి ఫ్రెండు అనిపిస్తుంది. నరసాపురంలొ మేం ఇద్దరం హైస్కూల్ మేట్స్ అతని పేరు, తండ్రి పేరు అది ఒకటే, అందుకే నాకనిపిస్తుంది మా ఫ్రెండేమోనని. అందుకని పెళ్ళికి వెడదామనుకుంటున్నాను. ఈ కళ్యాణమండపం ఎక్కడో చెప్పగలరా- హైదరాబాద్ లొ నాకసలు పరిచయం లేదు' అనడిగాడు.
'సికిందరాబాద్ లో వుంది. కాస్త దూరమే ఇక్కడికి.."
'మీరెలాగూ వెడతారుగా, వైడోంట్ వుయ్ గో టు గదర్' దివాకర్ అనగానే జయంతి మనసు ఒక్కక్షణం ఉద్విగ్నతకి లోనయింది. ఆ ప్రయత్నంగానే 'మనద్దిరమూనా...' అంది.
"మీకేమన్నా అభ్యంతరం అయితే, ఫరవాలేదు, ఎవరినన్నా దారి అడిగి వెడతాను. ఎలాగో కారులో వెడతానుగదా మీరొస్తే మీకు ట్రాన్స్ పోర్ట్ ప్రాబ్లం, నాకు దారి ప్రాబ్లం వుండదని అడిగాను' సూటిగా చూస్తూ అన్నాడు.
'నో...నో... అభ్యంతరం ఏముంది.... ఇట్స్ మై ప్లెజర్..." గొణిగింది.
'అయితేసరే, సాయంత్రం ఆరున్నరకి రెడీగా ఉండండి, మీరుండేది ఎక్కడ చెప్పండి వచ్చి పికప్ చేస్తాను' అన్నాడు.
సాయంత్రం మామూలు కంటే ఎక్కువ శ్రద్దగా అలంకరించుకుంది జయంతి. దివాకర్ తో కలిసి పెళ్ళికి వెడుతుంది. స్టాఫ్ అందరుండగా అతను తననే అడిగాడు అంటే అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నట్లనిపించింది. అతనితో పరిచయం పెంచుకునే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఉషారాణి నవ్వుతూ అన్నీ అతని వివరాలు తెలుసుకోవాలి. పెళ్ళికి.....అంటే బాచిలర్ అన్నమాటేగా! అతనితో పరిచయం పెంచుకుంటే ఎలాంటివాడో అర్ధమవుతుంది. ఇద్దరి ఆలోచనలు, భావాలు కలిస్తే, తను కోరుకునేవన్ని అతనిలో ఉన్నాయి. ఇద్దరికీ కుదిరితే... ఆలోచనల మద్య కారు హారన్ వినిపించింది.
కారులో అతని పక్క సీటులో కూర్చుని వెడుతూంటే...స్టీరింగ్ మీద అలవోకగా కదిలే అతని వేళ్ళు, అతను వాడిన ఏ పెర్ ఫ్యూమో, లేక డెనిమ్ ఆఫ్టర్ షేవ్ లోషనో... ఏదో చక్కని పరిమళం.....మొదటిసారి ఓ పురుషుడి పక్కన కూర్చుని వెడుతూంటే జయంతి మనసు, శరీరం రెండూ ఉద్విగ్నతకి లోనయ్యాయి.....' చాలా దూరమేనే... మీరు రాకపోయుంటే, దారి వెతుక్కోవడం కష్టమే అయ్యేది....' అన్నాడు దివాకర్. ఇంతకీ ఆ పెళ్ళికొడుకు మా ఫ్రెండ్ కాకపోతే... ఎవరూ తెలియని వాళ్ళ మధ్య ఎంబ్రాసింగ్ గా వుంటుందేమో. మీ స్నేహితురాలు ఆశ్చర్యపోతుందేమో. శుభలేఖ ఏదో మర్యాదకోసం ఇస్తే నిజంగా పరిగెత్తి వచ్చాడనుకుంటుందేమో' కాస్త హాస్యంగా అన్నాడు.
'ఛా...అలా ఎందుకు అనుకుంటుంది.... తెలిసిన వారెవరూ లేకపోయినా నేనున్నాగా.
'ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ....ఎందుకో అతను నా ఫ్రెండని సిక్స్త్ సెన్స్ చెపుతూంది. అందుకే నే వస్తున్నాను. చిన్నప్పుడు ఇద్దరం ఐదో క్లాసు నించి మెట్రిక్ వరకు ఒక స్కూలు లొ చదివిన పరిచయం. తరువాత అవుటాఫ్ టచ్.... మా నాన్నగారికి తరచు బదిలీలు అయ్యేవి. అంటే ఇద్దరు మళ్ళీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు. ఆల్ మోస్ట్ పదిహేనేళ్ళ తరువాత చూడబోతున్నాను. అతనే అయితే గుర్తు పడతాడు లేదో అసలు...' డ్రైవ్ చేస్తూ సరదాగా మాట్లాడాడు. జయంతికయితే ఏదో లోకంలో ఉన్నట్టుంది అతని సాన్నిధ్యం. అతనంత చనువుగా మాట్లాడుతున్నాడంటే, తనని ప్రత్యేకంగా అడిగి కారులో తీసుకెడ్తున్నాడంటే తనంటే ఏదో మంచి ఉద్దేశం, ప్రత్యేక ఇంటరెస్ట్ వున్నట్టేగా....నవలల్లో చదివినట్లు మా పరిచయం ఆకర్షణగా ప్రేమగా మారుతుందా... ఇందుకు తనవైపు నించి తను తీసుకోవాల్సిన, చూపాల్సిన శ్రద్ద ఏమిటో...ఈ పరిచయాన్ని కొనసాగడానికి తన ప్రయత్నం తను చెయ్యాలి.... "ఏమిటి ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా...మీరెందుకో కంఫర్ట్ బుల్ గా వున్నట్టులేదు... నాతో ఇలా రావడం.....'
'అబ్బేబ్బే...అదేం కాదు.... మీరేదో చెప్తుంటే వింటున్నాను....' గాభరాగా అంది.
"ఆ.....కాస్త స్లో చెయ్యండి, నెక్స్ ట్ రైట్ టర్న్