మనసున మనసై 6
మనసున మనసై 6 'నే చచ్చే వరకు పోదు' కసిగా అంది జయంతి. దమయంతి నవ్వింది. 'అక్కా చిన్నప్పటి సుమతి పద్యం గుర్తు తెచ్చుకో. 'తన కోపమే తన శత్రువు...తన శాంతమే తనకు రక్ష.....అక్కా....అయిందేదో అయింది. అతనిప్పుడు నీ చెల్లెలి భర్త. మన కుటుంబంలో వ్యక్తి. వూరికే శత్రుత్వాలు పెంచుకుని ప్రయోజనం ఏముంది చెప్పు. అతను నీవు అవమానపరిచావన్న కోపంతో ఏదో ఆవేశంలో నీకు బదులిచ్చి అవమానపరిచాడు. దానికి కారణం నీవేగా, అక్కా అతను నా దగ్గర ఎంతో బాధపడ్డాడు తన మూలంగా నీవు ఇల్లు విడిచావని. నీకు అపాలజి చెప్పడానికి నీ ఇంటికి వెడదాం అని కూడా అన్నాడు".
"నాకేం అపాలజీలు చెప్పక్కరలేదు. రానక్కరలేదు....'కసిగా అంది జయంతి.
'అక్కా ఒక్క మాట చెప్తున్నాను. ఈ నెల రోజులలో ఆయనతో సాన్నిహిత్యం తరువాత నీవు ఎంత మంచి వ్యక్తిని చేతులారా చెయ్యిజార్చుకున్నావో నీకు తెలియదు. నా అదృష్టం కొద్ది అతను నాకు దొరికాడు- రత్నం లాంటివాడు"
"అవును.... బొగ్గులోంచేగా రత్నాలు పుట్టేది "వ్యంగ్యంగా అంది- దమయంతి మనసు ఒక్కక్షణం చివుక్కుమన్న వెంటనే దులుపేసుకుని నవ్వుతూ 'బాగా చెప్పావు. బొగ్గుల్లో రత్నాలను అందరూ గుర్తించలేరులే.....బొగ్గుల్లో వెతుక్కుంటే రత్నాలు దొరికేది ఎవరికో అదృష్టవంతులకేలే. జయంతి చెల్లెలి వంక చుర చుర చూసి 'అబ్బో - ఈ మాత్రానికే ఇంత మిడిసిపడిపోతున్నావు. ఇంకాస్త అందగాడు దొరికితే మఏమయ్యేదానివో.
'అందగాళ్ళను నీలాంటి వారికోసం వదిలేసా మరి.... చాల్లే అక్కా నీకు ఇంకా ఎప్పటికి మెచ్యూరిటీ వస్తుందో తెలియడం లేదు నాకు....' అంటూ ఎవరో తెలిసిన వారు పలకరిస్తే 'హలో...' అంటూ అటు వెళ్ళింది. జయంతి ఉడుక్కుంటూ మొహం ముడుచుకుంది. తనవైపు దివాకర్, గోపాలకృష్ణ రావడం చూసి మొఖాన నవ్వు పులుముకుంది. దివాకర్ చనువుగా