మనసున మనసై 9
మనసున మనసై 9 తండ్రి ఆఫీసు నుంచి డైరెక్ట్ గా నర్సింగ్ హోముకు వచ్చాడు. తండ్రి రావడంతో తడబడింది జయంతి మొహం ముడుచుకుని అక్కగారివైపు తిరిగి కూర్చుంది తండ్రిని చూడనట్టే. ఆయన ఒక్కక్షణం జయంతిని అక్కడ చూసి ఆశ్చర్యపడ్డా తేరుకుని ఏం జరగనట్టే' ఊ....ఎలా వున్నాడు మనవడు....' అంటూ భార్య వడిలో పడుకున్న పసివాడిని దగ్గిరకెళ్ళి మురిపెంగా చూశారు. తరువాత కూతురి దగ్గరకెళ్ళి "ఏం ప్రాబ్లం లేదు కదా, మీ ఆయనకి ఫోను చేశాను, సాయంత్రం ట్రైనుకి బయలుదేరి వస్తానన్నాడు. ఏమన్నా ఇచ్చారా తినడానికి దీనికి' అని భార్యని అడిగాడు. పది నిమిషాలు ఈమాట ఆ మాట మాట్లాడారు. కాని జయంతిని పలకరించలేదు. పద్మావతి కంటితో సైగ చేసింది. జయంతిని పలకరించమన్నట్టు. ఆయన పంతంగా పెదాలు బిగించి అవసరం లేదన్నట్టు తలాడించారు.
'అమ్మా, నీవు నాన్నగారితో ఇంటికెళ్ళిపో వంటా అదీ చూడాలిగా-భోజనం అది చేసి ఏకంగా రాత్రికిరా-నీవెళ్ళి దమయంతిని పంపు' అంది వాసంతి.
'అది వచ్చేవరకు వంటరిగా...' ఆవిడ సందిగ్ధంగా చూసింది.
జయంతి వుందిగా.... అది వచ్చే వరకు కూర్చుంటుందిలే' అంది.
తల్లి ఖాళీ ఫ్లాస్కులు, బట్టలు, క్యారేజి అవి తీసుకుని బయలుదేరింది. ఇద్దరూ వెళ్ళాక 'జయా, నాన్నతో మాట్లాడలేదేమో మర్యాదగా పలకరిస్తే ఆయన సంతోషించే వారు గదా. అయినా నీకెందుకే ఇంత పంతాలు, పట్టింపులు' చెల్లెలితో మందలిస్తున్నట్లంది.
'ఆయన మాట్లాడరా నాతో! నేనెవరినో అన్నట్టు మొహం తిప్పేసుకున్నారు చూశావుగా' ఉక్రోషంగా అంది జయంతి. 'ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఇన్నాళ్ళకి కనిపిస్తే కూతురిని గదా ఎలా వున్నావు అనైనా అన్నారా.
'బాగుంది. ఇంట్లోంచి దెబ్బలాడి వెళ్ళింది నీవు. వాళ్ళేం పొమ్మనలేదుగా నిన్ను, చిన్న దానివి నీకే అంత పంతం పౌరుషం వుంటే ఆయనకుండదా'
'అంతా నన్నే అంటారు. నేనేం చేసినా తప్పుకిందే లెక్క' మొహం ముడుచుకుని, పట్టుకున్న గొంతుతో అంది.
"ఇంకా ఎందుకే ఈ పంతం పట్టుదల- అతను మన ఇంటి అల్లుడయ్యాడు. దమయంతి హాయిగా సంతోషంగా ఉంది. జయా, ఒక్కమాట మాత్రం చెప్పదలిచాను. గోపాలకృష్ణని వదులుకుని నీవు