మొండి 1 ది రూమ్
telugu stories kathalu novels మొండి 1 ది రూమ్ అది నిజాం కాలం నాటి గెస్ట్ హౌస్. CM క్యాంపు ఆఫీస్ పక్కన ప్రాంతం. ఇప్పుడు అది పోలీసు interrogations జరిగే ప్రదేశం.బయట జనానికి అది ఒక బూతు బంగాళా లా కనిపిస్తుంది. కానీ , కరుడు కట్టిన క్రిమినల్స్ ని ఇంటరాగేట్ చెయ్యడానికి సి.బి.ఐ. అదే కేంద్రంగా నిర్వహిస్తుంటుంది. హార్డ్ కోర్ క్రిమినల్ ఎవడు దొరికినా . అక్కడే విచారిస్తుంటారు.దేశం మొత్తం షాక్ కి గురి చేసిన ఒక వైట్ కాలర్ క్రిమినల్ ని ఇప్పుడు విచారించడానికి వెళ్తున్నాడు సి.బి.ఐ. డైరెక్టర్ సత్యనారాయణ(సత్యం). సిట్యుయేషన్ ఏదైనా అస్సలు వెనక్కి తగ్గడు. పెద్ద పెద్ద మాఫియా లీడర్లు కూడా టచ్ చెయ్యడానికి జంకుతారు అతన్ని చూసి . అస్సలు రిజల్ట్ రాదనుకున్న కేసుల కల్లా అయన దేవుడై కనిపిస్తాడు గవర్నమెంట్ కి. సత్యం ట్రాక్ రికార్డు లానే, అతని ఇంటరాగేషన్ మెథొద్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.FOR EXAMPLE, 2 నెలల క్రితం ఒక ISIS మద్దతుదారుడైన టెర్రరిస్ట్ దొరికాడు. సత్యనారాయణ (సత్యం ) దగ్గరికి ఇంటర్రోగేషన్ కోసం పంపారు. సత్యం ఒక్క దెబ్బ పీకలేదు. ఒక్క మాట అనలేదు. కాసేపు కూర్చుని, మాట్లాడాడు. అయ్యిన తరువాత బిర్యానీ తెప్పించి పెట్టాడు. తింటుంటే మధ్యలో ఎక్కిళ్ళు వచ్చాయి టెర్రరిస్ట్ కి. అంతే సత్యం మైండ్ గేమ్ అదే. అతనికి మంచి నీళ్లు ఇవ్వలేదు. మాములు ఎక్కిళ్లయితే ఆపుకునే వాడు . కానీ, బిర్యానీలో నెయ్యి ఎక్కువ వేసి కలిపి పెట్టడంతో దాహం ఎక్కువయ్యింది.చచ్చిపోతానేమో అన్నట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. చివరికి ఆ టెర్రరిస్ట్ కి టార్చర్ ఎంత పీక్స్ కెళ్ళిందంటే సత్యం అడిగిన కొన్ని questions కి చచ్చినట్టు సమాధానం చెప్పేదాకా. చుసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మలేక పోతున్నారు. “బిర్యానీతో కూడా ఇంటరాగేషన్ చేస్తారా ” అని షాక్ తిన్నారు. అది . సత్యనారాయణ స్టైల్.ఛాంబర్ నుంచి బయలుదేరి ఫయాజ్ మంజిల్ కి కేస్ డీటెయిల్స్ , క్రిమినల్ రికార్డ్స్ పట్టుకెళ్ళాడు. ఇంటరాగేషన్ 2వ కేబిన్ రూమ్ లో. టైట్ సెక్యూరిటీ మధ్యలో మాములు కుర్చీ మీద కూర్చుని ఉన్నాడు ముద్దాయి.అతని పేరు వీరు. వీరేంద్రనాధ్.
సినిమాల్లోలా ఒంటరిగా గదిలో కురుకోబెట్టే సీన్ లేదక్కడ. మాములు నిజాం స్టైల్ బంగాళా లో పాతకాలం ఫ్యాన్ వేసి కూర్చోబెట్టారు. కింద అరేబియన్ గళ్ళ కార్పెట్, ఎదురుగా చిన్న టివి. చుట్టూ టైట్ సెక్యూరిటీ. ఎదురుగా వచ్చిన డైరక్టర్ ముందు తానుగా “హాయ్ ” అని విష్ చేసాడు. వీరు తల ఎత్తి