మొండి 10 గూగుల్ బాంబు
telugu stories kathalu novels మొండి 10 గూగుల్ బాంబు" అలాగే, క్రైం లో, తీవ్రవాదుల పనుల్లో, కాస్త బాగా గమనిస్తే చాలా రకాల patterns దొరుకుతాయి. ఆయా pattern ని బట్టి మనం వారి తరువాతి అడుగుని అంచనా వేయడం వీలవుతుంది. సో. అన్ని రకాల పనుల్లో అలాంటి patterns ని ముందే గుర్తు పట్టి వాళ్ళ పని పెట్టడమే మన డిపార్ట్మెంట్ పని. "
వీరుకి వందల కొద్దీ ఆలోచనలు మనసులో తిరుగుతున్నాయి. ఆయన్ని అడుగుదాం అనుకున్నాడు కానీ, అప్పుడే ఎందుకు బుర్ర తినడం లే అని ఊరుకున్నాడు.
"నిజానికి ప్రపంచంలో యుద్ధాలన్నీ ఎలా జరుగుతాయో తెలుసా? అని అడిగాడు"
"సార్ ఏముంది. దాడి చేసి ఒకళ్లపై ఒకళ్ళు గెలుస్తారు. రెండు వైపుల వాళ్ళు కొట్టుకుంటారు ,వ్యూహాలు పన్నుతారు, బాగా యుద్ధం చేసిన వాళ్ళు గెలుస్తారు. అంతే కదా."
" అది మనం హిస్టరీ పుస్తకాల్లో చదువుకున్న చరిత్ర. అసలు కథ వేరు. ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధం లో సైనికులు, రాజులు గురించి మాత్రమే చెబుతారు. ఇంకాస్త ఇంగ్లిష్ సినిమాలు చూస్తే వాళ్ళ వాళ్ళ వ్యూహాలు గురించి కొంత తెలుస్తుంది. కానీ , ఎప్పుడూ బయటకు కనిపించని ఆయుధాలు రెండు ఉంటాయి. ఒకటి ఇన్ఫోర్మేషన్ , ఇంకొకటి సరఫరా "
వీరు ఒక రకమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.ఏ సబ్జెక్ట్ వాళ్ళు వాళ్ళ గురించి అలా గొప్పగా చెప్పుకోవడం మామూలే కదా అన్న ఫీలింగ్ కి ఎక్స్ ప్రెషన్ అది. అయితే , అతన్ని గమనించిన దేవేంద్ర అన్నాడు.
" కన్ఫ్యూషన్ గా ఉంది కదా " అని అడిగాడు. వీరు అవును కాదన్నట్టు సినిమా స్టైల్ లో తల ఊపాడు.
" చిన్న పిల్లోడివి! " అంటూ వీరు జుట్టుని