మొండి 12 లక్ష్యం
telugu stories kathalu novels మొండి 12 లక్ష్యం పొద్దున్నే లేచి , తిరిగి కాలేజీకి వెళ్తున్న వీరు మనస్సులో ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో చెయ్యాలి అనుకున్న పనులు అన్నీ ఇప్పుడు అంచనాలు తప్పాయి. ఒకటి అనుకుంటే ఒకటి అవ్వడం. లేదా , అసలు అనుకున్నది ఏది సరిగ్గా పూర్తికాకపోవడం.
నిజానికి వీరు కి NIA లో తన పనేంటో కూడా అర్ధం కావడం లేదు. టెంపొరరీ గా మాత్రమే పని చేసి వదిలించుకుంటే బాగుండు అనిపిస్తోంది అతనికి . ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేరు కంపెనీ లలో ప్లేస్ మెంట్ లు సంపాదిస్తున్నారు. దివ్య ఫ్రెండ్ ( అవ్వొచ్చని ) అనుకుంటున్న అరుణ్ కూడా హైదరాబాద్ లోనే ఏదో గేమ్ కంపెనీ లో ప్లేస్ మెంట్ వచ్చింది.
జీవితం మొత్తం ఇలానే గడిపేస్తానేమో అన్న భయం ఉండేది. కొత్తగా రెండు వారాల్లో జరిగిన సంఘటనలను అన్నింటినీ నెమరు వేసుకుంటున్నాడు. ఈ లైఫ్ లో నాకు ఏమి కావాలి?అనే ప్రశ్న కి క్లియర్ గా తాను రాసుకోవాల్సి వచ్చిన సమయం ఏర్పడింది.
అనాధగా తాతయ్య , నానమ్మల దగ్గర పెరిగిన అతని జీవితాన్ని మలుపు తిప్పింది దివ్య నే. దివ్య అంటే పిచ్చి పిచ్చి గా ఆరాధన ఉంది. అది ప్రేమ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంచుకున్న ఉద్యోగం ఏమో , ఎవ్వరికీ తెలియకుండా వచ్చి ఇరుక్కున్న చందంగా ఉంది. " హా ఏముందిలే! కొన్నాళ్ళు మంచి టీం తో వర్క్ చేసి తరువాత లైఫ్ లో బిజినెస్ గురించి ఆలోచిద్దాం లే అనుకున్నాడు. ఇకపోతే దివ్య ఇంట్లో పెళ్లి మాట రావడానికి ఇంకా 2 సంవత్సరాలు పట్టొచ్చు ఆలోపల తాను బిజినెస్ లో మినిమం ఫిట్ గా సెట్ అవ్వాలి. దానికి తగ్గట్టు ప్లాన్ వేసుకున్నాడు వీరు.
తాను చెయ్యాల్సిన పనులు
1. తన టీం ద్వారా వీలైనంత టెక్నాలజీ ని నేర్చుకోవడం
2. దివ్య ని పెళ్లి చేసుకోవడం
అలా ఫిక్స్ అయ్యాడు కుర్రాడు.
అనుకున్నదే తడవుగా అసలు దివ్య కి "నేర్పిస్తా" అని బిల్డ్ అప్ కొట్టిన