మొండి 19 నిజాలు – అబద్ధాలు
telugu stories kathalu novels మొండి 19 నిజాలు - అబద్ధాలు వీరు చిన్నప్పుడు తల్లి తండ్రులు కోల్పోయినప్పుడు తప్ప ఎప్పుడూ ఏడవలేదు. ఆ తరువాత కాలేజీ కి వచ్చిన తరువాత నుండి తన టాలెంట్ ని గుర్తించి ప్రోత్సాహించింది ఒక్క రవి సార్ మాత్రమే. అలంటి మనిషి తన జీవితం నుండి ఉన్నట్టుండి మాయం అవ్వడం వీరు కి అర్ధం కావడం లేదు. " నేను ఎవరిని ఇష్టపడినా ఇలా దూరం ఐపోతారేమో ? " అని లోలోపల భయం ఏర్పడింది.
రవి సార్ మరణ వార్త మరుసటి రోజు కాలేజీలో తెలిసిపోయింది. కాలేజీకి ఒక రోజు సెలవు ప్రకటించారు. దాదాపు అన్ని డిపార్ట్మెంట్ విద్యార్థులు వచ్చి అంజలి ఘటించారు. వీరు అక్కడ ఉన్నాడనే కానీ, నిశ్శబ్దంగా ఎవరితోనూ మాట్లాడకుండా గడుపుతున్నాడు. రవి మరణాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియక వీరు లోలోపలే కుమిలి పోతున్నాడు. అతని శవాన్ని చూడటానికి కూడా వీరుకి ధైర్యం చాలడం లేదు. రవి సార్ భార్య వెక్కి వెక్కి ఏడుస్తోంద. వచ్చి చూసాక ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. పక్కనున్న వీరుని ఎవరూ గమనించడం లేదు. NIA వాళ్ళు ఎవరైనా వస్తారా అని చూసాడు. వెతికి చూస్తే రాజేష్ మాత్రమే అక్కడ కనిపించాడు. ఇంకెవరూ లేరు.
ఒక్క దివ్య తప్ప. కానీ, ఆ రోజు దివ్య మామూలుగా రాలేదు , అరుణ్ తోపాటు వచ్చింది. ఇద్దరూ కలిసి వస్తుంటే , మిగతా క్లాస్ మేట్స్ మాత్రం సైలెంట్ గా గుస గుస లాడుతున్నారు. దివ్య అరుణ్ ని ఉండమని చెప్పి వీరు దగ్గరికి వచ్చింది. వీరు ఫ్రూస్టేషన్ ,బాధ పీక్స్ లో ఉన్నాయి. దివ్య ఏదో మాట్లాడుతోంది కానీ , వీరు ఈ లోకంలో లేడు. కానీ, నిశ్శబ్దంగా ఆమె కళ్ళల్లోకి శూన్యంగా చూస్తూ వింటున్నాడు. " సరే ! సాయంత్రం కాల్ చేస్తా ". అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. దివ్య పైన పొసెసివ్ గా ఫీల్ అవుతూ ఉన్న వీరు , ఆ రోజు మాత్రం వైరాగ్యం తో ఆమె వైపు చూసాడు.
ఎదురుగా ఉన్న రవి శవాన్ని చూస్తూ ఒక్కటే ఆలోచన " అసలు రవి సార్ నన్ను ఎందుకు NIA కి తీసుకువచ్చారు? ఆయన అసలు ఏమి చేస్తుంటారు? అసలు ఆయనను చంపాల్సినంత పగ ఎవరికి ఉంటుంది " అని.
సడన్ గా గుర్తొచ్చింది వీరు కి " రవి సార్ కాలేజీలో అన్న మాటలు " . "నాతో ఎక్కువగా కనిపించకురా బాబు " అని. దానర్ధం ఏమిటి ? ఇదే ఆలోచనతో వీరు అక్కడినుండి మరో రెండు రోజులు గడిపేశాడు. రూములో కూడా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. అసలే చివరి సంవత్సరం ప్రాజెక్ట్స్ ఎంచుకునే