మొండి 25 మిలిటరీ ప్రాజెక్ట్
telugu stories kathalu novels మొండి 25 మిలిటరీ ప్రాజెక్ట్ "లేదు సార్. మనం గనుక ఈ ఒక్క క్లూ ని కనుక పట్టుకోలేకపోతే ఈ కేసులో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఛాన్స్ లేదు "
" వాళ్ళు బాడీల్లో ఎలాంటి సెన్సార్లు లేవు అని చెబుతున్నారుగా. పోస్ట్ మార్టెర్మ్ ఎందుకు చేస్తారు. పిచ్చోళ్లా " అని గట్టిగా అడిగాడు.
" అయ్యుండొచ్చు. అసలు సెన్సార్లు కాకుండా మరింకేమైనా వారి శరీరంలోకి ఆపరేషన్ టైం లో ఉంచి ఉండొచ్చు సార్. ఒక్క సారి లాస్ట్ ట్రై చేద్దాం."
ప్రొఫెసర్ దేబేంద్ర వీరు కళ్ళల్లోకి కాసేపు పాటు చూసాడు. నిజానికి ఇంతకు మించి వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు .
" చూడు వీరు! నువ్వు చెప్పిన లీడ్ లో 1 పెర్సెంట్ మనకు ఏమి దొరికినా సంతోషంగా వెళతాం. లేదా ఇన్నేళ్ల నా కెరీర్ లో మొదటి సారి తలవంచుకుని వెళ్లాల్సి వస్తుంది. నీ కెరీర్ కూడా ఇక్కడితో ఆగిపోతుంది "
" నాకు నమ్మకం ఉంది సార్! లెట్స్ ట్రై ఓన్లీ ఒన్స్ " అన్నాడు వీరు.
సరే అని మరుసటి రోజున ప్రకాష్ సింగ్ ని కలిసి ఇదే విషయం పై రూంలో ఒంటరిగా మాట్లాడాడు. బయటికి ప్రకాష్ సింగ్ అరుపులు కూడా వినిపిస్తున్నాయి. బయట నిలబడిన వీరు కి ముచ్చెమటలు పట్టేశాయి. బయటకు వచ్చిన ప్రొఫెసర్ దేబేంద్ర ఒప్పించానని సూచన ప్రాయంగా తెలిపాడు.
అయితే , అతని శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా రాత్రి పూట తవ్వించే ఏర్పాట్లు చేసుకోమ్మన్నారు వారు. అదృష్టవశాత్తూ అన్వర్ పాషా ఢిల్లీ వాడు. రాజ్ పురా స్మశానం లో అతని శరీరాన్ని ఖననం చేశారు. అప్పటికప్పుడు ఒక డాక్టర్ ని ఏర్పాటు చేసుకుని వెళ్లారు వారు.
రాజ్ పురా స్మశానం ఆర్మీ వారిది. అందులోని సెక్యూరిటీ వారికి అసలు విషయం చెప్పి ఒప్పించి , రాత్రికి కాపరి , మరికొందరి సాయం తీసుకుని తవ్వించారు. లోపల ఉన్న అన్వర్ పాషా శరీరాన్ని బయటకు లాగారు. మొదటి సారి ఒక కుళ్లిపోతున్న శరీరాన్ని చూసాడు వీరు. వెంటనే భళ్ళున వాంతి చేసుకున్నాడు.
అప్పటికప్పుడే మరొక బండ్లో వెళ్లి ఒక మారుమూల రూమ్ కి తీసుకువచ్చి శవ పంచనామా చేశారు. తిరిగి డాక్టర్ అతి కష్టం మీద సగం కుళ్ళిన అతని దేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టెర్మ్