మొండి 29 customs
telugu stories kathalu novels మొండి 29 customs సీక్రెట్ ఏజెంట్ గా ట్రైనింగ్ అంత సులువుగా నడవటం లేదు. వచ్చిన ఏడుగురిలో నెల రోజుల తరువాత, కేవలం 3 మాత్రమే కంటిన్యూ చేయగలిగారు. మిగతా వారు స్వచ్ఛందంగా రామ్ రామ్ చెప్పేసి వెళ్లిపోయారు. వాళ్ళందరినీ తిరిగి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లలో సాధారణ మైన పాత ఉద్యోగాల్లో ఉంచారు. వీరు తో పాటు మిగిలిపోయిన వాళ్లలో ఇంతక ముందు అతనికి పరిచయం అయిన పట్నాయక్ , కురంజిత్ అనే మలయాళీ మాత్రమే మిగిలారు.
ఒక్కొక్క ట్రైనింగ్ గడిచే కొద్దీ వీరు రాటు తేలుతున్నాడు. కానీ , చిన్న సమస్య ఏంటంటే, పెట్టిన ఏ పరీక్షల్లోనూ మొదటి రాంక్ లో రాలేకపోతున్నాడు. అందరికన్నా కాస్త లేట్ గానే పని అవుతోంది. ఒక వేళ ఖంగారు పడి తొందరగా పూర్తి చేద్దాం అనుకుంటే , అసలు ఛాలెంజిని పూర్తి చేయలేకపోతున్నాడు. అందుకే నెమ్మదిగా అయినా , ఇచ్చిన టాస్క్ ని పూర్తి చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు.
ఇండియా లో ఐఏఎస్, IPS , లాంటి ట్రైనింగ్స్ లో ఎలా అన్ని చోట్ల కొంత కాలం పని చెయ్యిస్తారో , సీక్రెట్ ఏజెంట్ ట్రైనింగ్ అప్పుడు కూడా పలు ముఖ్యమైన చోట్ల వాళ్ళందరినీ పని దగ్గరుండి చూస్తూ నేర్చుకోవడానికి అవకాశం ఇస్తారు. అవసరమైతే వాళ్ళు కూడా ఆయా ప్రాజెక్ట్స్ లో కాసింత భాగ్వస్వామ్యం తీసుకోవాలి. ప్రస్తుతం వీరు అండ్ కో , ముగ్గురు ట్రైనీ లకు ముంబై ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ వారి దగ్గర కొంత కాలం ఉండమని ఆర్డర్స్ వచ్చాయి. అందరూ ఎయిర్ పోర్ట్ డ్యూటీ కి వెళ్లే ముందు BVR పిలిచి ఇలా అన్నాడు.
" సీక్రెట్ ఏజెంట్ గా ఎప్పటికీ ఒక విషయం మరిచిపోకండి. మనం మొత్తం పని చెయ్యం. కేవలం మనం చెయ్యాల్సిన టాస్క్స్ ని నెరవేరుస్తాం. ఇంకో మాటలో చెప్పాలి