నాగార్జున సాగర్ డ్యాం
అది నాగార్జున సాగర్ డాం. ఇంజినీరింగ్ కాలేజీ లో CSE , 2nd year స్టూడెంట్స్ అందరూ కలిసి టూర్ కోసం అక్కడికి వచ్చారు. పేద కుటుంబం నుండి వచ్చిన వీరు, ఇంకా అందరితో అంత ఫ్రీ గా మూవ్ అవ్వలేకపోతున్నాడు. క్లాసులో అతని చదువు కూడా అంతంత మాత్రమే. ఒక్క మాథ్స్ సంబందించిన టాస్కుల్లో మాత్రమే అతను స్పెషల్. వాళ్ళని తీసుకొచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి అందరికీ అక్కడున్న ఒక్కో ప్రదేశాన్ని చూపించి లోకల్ ఇంజనీర్ సహాయంతో explain చేస్తున్నాడు. లోపల నీటితో తిరిగే టర్బైన్లు వాటి పని చేసే తీరును చెబుతున్నాడు. కానీ, అందరి దృష్టి ఎక్కువగా సెల్ఫీలు, ఫోటోలు నాగార్జున కొండ అందాలు మీద ఉంది. కాబట్టి రవికి తను చెప్పే విషయం వెస్ట్ అనిపిస్తోంది. అప్పుడే గమనించాడు, తాను చెప్పిన ప్రతి దానికీ నోట్స్ రాస్తూ ఎదో పరధ్యానం లో ఉన్న వీరు. మిగతా వాళ్ళతో కలిసి టైం వెస్ట్ చేసుకోవడం కన్నా , ఎప్పటినుండో తాను గమనిస్తున్న వీరు కి కొన్ని విషయాలు చెపుదాం అని ఫిక్స్ అయ్యాడు. స్టూడెంట్స్ కి వివరించే పని పక్కనున్న వేరే స్టాఫ్మొండి 3 డ్యామ్
telugu stories kathalu novels మొండి 3 డ్యామ్ జైల్లో కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తున్న వీరు కి మనసులో వందల కొద్దీ ఆలోచనలు మెదులుతున్నాయ్. ఒక్కో సారి అన్నీ తెలిసినప్పుడు వచ్చే ఆనందం కంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వాళ్ళ వచ్చే భయం బాధపెడుతుంది. తనని ఇక్కడ దాకా తీసుకువచ్చిన ఒక్కో సంఘటనని , దాని వెనుక ఉన్న ప్రతి మనిషిని లెక్కగా రాసుకుంటున్నాడు. అందులో పేర్లు ఇంతక ముందే , జైలర్ తొక్కి పడేసిన లిస్ట్ లో ఉన్నవి.
అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు. బి.టెక్ చదవటానికి ఇబ్బందులు పడ్డ అతను, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి నేరాల్లో ఎలా భాగం అయ్యాడు. ఊహిస్తే, తనకేం అర్ధం కావడం లేదు.
తనని, ఇటు వైపు తిప్పిన మొదటి సంఘటన గురించి ఆలోచిస్తున్నాడు.