మొండి 64 ప్రేమ
telugu stories kathalu novels మొండి 64 ప్రేమ పొద్దున్న లేచి లేవగానే వీరు కి పిలుపు వచ్చింది.. జైలర్ నుండి... అనుమానంగా నడుచుకుంటూ వచ్చాడు వీరు, జైలు గదుల్లో మిగతా ఖైదీలను చూస్తూ ....
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియని గందరగోళం అతని జీవితంలో చోటు చేసుకుంది... నిజంగానే తనని చంపడానికి ఎవరైనా ప్లాన్ చేశారా అణా ఆలోచనతో నడుస్తున్నాడు వీరు...
"కింద కరెంట్ వైర్లు ఏమన్నా పెట్టారా...? లేదా పక్కనున్న ఖైదీలకు ఏదైనా మారణాయుధాలు ఇచ్చారా అన్న కోణంలో ఆలోచిస్తూ ఒక్కో అడుగు జాగ్రత్తగా వచ్చాడు వీరూ... జైలర్ రూమ్ దగ్గరికి రాగానే... వీరు ని కూర్చోబెట్టారు ... మామూలుగా ఖైదీలకు తమ వారిని కలుసుకోవడానికి మీటింగ్ పాయింట్ ఉంటుంది.. అలా కాకుండా ఇక్కడ ఎందుకు రప్పించారు?" అని అనుమానించాడు వీరు..
" నీకోసం ఎవరో వచ్చారు వీరేంద్రనాధ్ గారు... "
ఆయన అలా మర్యాదగా ఎందుకు పిలుస్తున్నారో వీరు కి అర్ధం కాలేదు...
రాజేష్ తనకోసం ఇక రాడు అనుకున్నాడు వీరు.. ఇపుడు రాజేష్ వస్తే ఎలా అతనితో మాట్లాడాలి... ఏమి చెప్పాలి? అన్న ఆలోచనలో వీరు ఉండగా ఎదురుగా ఒక ఆకారం వచ్చి నిలబడింది... వీరు స్టన్ అయిపోయి కొయ్యలా నిలబడ్డాడు...
" దివ్య"
మూడు సంవత్సరాల తరువాత అదే దివ్య ని తిరిగి చూడటం... ఇక జీవితంలో నీ మొహం చూడను అని చెప్పిన దివ్య తన కోసం ఎదురుగా వచ్చి నిలబడింది... వీరు కి గుండె